పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మొదలైనపుడు.. మేకింగ్ దశలో ఉన్నపుడు పరిస్థితి ఎలా ఉన్నా సరే.. రిలీజ్ టైంకి మొత్తం కథ మారిపోతుంది. ఆటోమేటిగ్గా హైప్ వచ్చేస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రీమేక్ మూవీ చేశాడంటే.. అభిమానులు ముందు నిట్టూర్చడం.. మేకింగ్ దశలో కూడా లైట్ తీసుకోవడం మామూలే. కానీ రిలీజ్ దగ్గరపడేకొద్దీ హైప్ పెరుగుతూ వస్తుంది. విడుదల రోజు థియేటర్లలో సందడి మామూలుగా ఉండదు.
గోపాల గోపాల.. కాటమరాయుడు.. వకీల్ సాబ్.. భీమ్లా నాయక్.. ఈ సినిమాలన్నింటి విషయంలోనూ ఇలాగే జరిగింది. ముఖ్యంగా ‘కాటమరాయుడు’, ‘వకీల్ సాబ్’ సినిమాల విషయంలో అభిమానుల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలిసిందే. కానీ అవి కూడా మంచి హైప్ మధ్యే రిలీజయ్యాయి. కట్ చేస్తే ఇప్పుడు ‘బ్రో’ సినిమా విషయంలోనూ అభిమానుల్లో ముందు నుంచి అసంతృప్తే ఉంది. రీమేక్.. పైగా క్లాస్ టచ్ ఉన్న సినిమా కావడం.. ఇంకా రకరకాల కారణాల వల్ల ఈ సినిమాకు హైప్ లేదు.
రిలీజ్ దగ్గర పడుతున్నా సరే.. ‘బ్రో’కు అనుకున్నంత హైప్ లేనట్లే కనిపిస్తోంది. పాటలు కూడా అభిమానుల్లో హుషారు తెప్పించలేకపోయాయి. ట్రైలర్ వరకు బాగానే అనిపించింది. యుఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని రోజుల ముందే మొదలు కాగా.. కొంచెం నెమ్మదిగానే సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. పవన్ సినిమాలకు ప్రతిసారీ జరిగే మ్యాజిక్ ఈసారి జరుగుతుందా లేదా అన్నది కొంచెం సందేహంగానే ఉంది.
దీనికి అన్ని నెగెటివ్స్ కనిపిస్తున్నాయి మరి. కానీ పవన్ క్రేజ్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. రీమేక్‌ల విషయంలో తమ అసహనాన్ని వెళ్లగక్కే అభిమానులే.. రిలీజ్ టైంకి సర్దుకుని థియేటర్లకు పరుగులు పెడతారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఎగబడతారు. బుకింగ్స్ మొదలైతే టికెట్ ముక్క మిగలనివ్వరు. థియేటర్లు మొత్తం ఫ్యాన్స్‌తో నిండిపోతాయి. మరి ఈ నెల 28న ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 8, 2023 4:34 pm
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…