సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు బాగా టెన్షన్లో ఉన్నారు. రాజమౌళి సినిమాతో మహేష్ గ్లోబల్ స్థాయికి వెళ్లబోయే ముందు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తున్న ‘గుంటూరు కారం’ మూవీతో ఒక పెద్ద సక్సెస్ అందుకుంటాడని ఆశిస్తే.. ఆ సినిమాకు సంబంధించి ఎడతెగని నెగెటివ్ న్యూస్‌లు మీడియాలో, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండటంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ‘గుంటూరు కారం’ పేరెత్తితేనే చిరాకు వచ్చేసే పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే ఈ సినిమా కథ మారింది. నటీనటులు, టెక్నీషియన్లు మారారు. తరచుగా సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడుతున్నాయి. మరోవైపు రిలీజ్ డేటేమో దగ్గర పడిపోతోంది. ఇన్ని మార్పులు చేర్పులు, వివాదాల తర్వాత సినిమా అనుకున్నట్లుగా సంక్రాంతికి రిలీజవుతుందా లేదా అన్న డౌట్లు కలుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అసలీ సినిమా ముందుకు కదులుతుందా.. మధ్యలో ఆగిపోతుందా అనే సందేహాలు కూడా చాలామందిలో ఉన్నాయి.
ఐతే ఎన్ని వివాదాలున్నా.. ఎన్ని మార్పులు చోటు చేసుకున్నా సినిమా అయితే ఆగే పరిస్థితి లేదన్నది చిత్ర వర్గాల సమాచారం. మహేష్ లాంటి పెద్ద స్టార్, త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్ మధ్య ఓ పెద్ద నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న సినిమాను మధ్యలో ఆపేస్తే అది చాలా పెద్ద ఇష్యూగా మారుతుంది. అసలు ఈ సినిమా మీద ఇప్పటికే వంద కోట్ల దాకా ఖర్చు కూడా పెట్టేశారు. మహేష్‌తో సహా ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఇచ్చిన పారితోషకమే ఇందులో 60-70 శాతం దాకా ఉంది. ప్రొడక్షన్ మీద కూడా 30-40 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. సినిమా ఆరంభ దశలోనే బయ్యర్ల దగ్గర అడ్వాన్సులు తీసుకున్నారు.
ఇంత జరిగాక సినిమాను ఆపేయడం అంటే అసాధ్యమనే చెప్పాలి. ఎన్ని సమస్యలున్నా పరిష్కరించుకుని సినిమాను ముందుకు తీసుకెళ్లాల్సిందే. మహేష్ ఏడాది కిందట్నుంచి ఈ ప్రాజెక్టుకే అంకితమై ఉన్నాడు. ఇప్పుడు సినిమా ఆపడానికి అతను మాత్రం ఎలా అంగీకరిస్తాడు? సినిమా ఆపే ప్రసక్తే లేకపోగా.. ఎలాగైనా వచ్చే సంక్రాంతికే రిలీజ్ చేయాలని కూడా టీం భావిస్తోంది. మహేష్ వెకేషన్ నుంచి తిరిగొచ్చాక టీం అంతా ఒకసారి కూర్చుని ఇకపై ఏ సమస్యలూ రాకుండా ఒక మాట అనుకుని చిత్రీకరణను వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on July 24, 2023 4:04 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…