నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ముందు నుంచి ప్రచారం జరిగినట్టే ఎక్స్ ట్రాడినరి మ్యాన్ టైటిల్ ని లాక్ చేస్తూ అధికారికంగా ప్రకటన ఇచ్చారు. విడుదల తేదీ డిసెంబర్ 23. అయితే ఇంతకు ముందు ఇదే క్రిస్మస్ ని టార్గెట్ చేసుకుని వెంకటేష్ సైంధవ్, నాని హయ్ నాన్న ఆల్రెడీ బరిలో ఉన్నాయి. ఇది తెలిసి కూడా నితిన్ నిర్మాతలు రిస్క్ కు రెడీ అవుతున్నారు. దేనికవే సంబంధం లేని జానర్లు కావడంతో ప్రేక్షకుల పరంగా సమస్య ఉండదు కానీ ఓపెనింగ్స్ కోణంలో చూసుకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు.
అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ దాని డిజాస్టర్ ఫలితం పెద్ద ప్రభావమే చూపించింది. దెబ్బకు పెద్ద గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ఇతర హీరోలకు కథలు అందించినా డైరెక్టర్ గా బ్రేక్ కోసం ఎదురు చూశాడు. ఫైనల్ గా నితిన్ తో చేతులు కలిపాడు. ఇందులో సినిమాలంటే పడి చచ్చిపోయే పాత్రలో హీరో క్యారెక్టర్ వెరైటీగా ఉంటుందని, జూనియర్ ఆర్టిస్టుగా కనిపించే ఎపిసోడ్స్ మంచి ఫన్ తో నడుస్తాయని ఇన్ సైడ్ టాక్. అయితే బ్యాక్ గ్రౌండ్ లో అంతర్లీనంగా యాక్షన్ ఉంటూనే రేసు గుర్రం తరహా ఫన్ పెడతారట.
ఇటు నితిన్ కు సైతం ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ హిట్టు కొట్టడం చాలా అవసరం. ఓవర్ మాస్ తో ట్రై చేసిన మాచర్ల నియోజకవర్గం దారుణంగా పోవడం బాగా షాక్ ఇచ్చింది. తన బాడీ లాంగ్వేజ్ కి సూట్ కానీ మాస్ ట్రై చేసినప్పుడంతా దెబ్బ తింటున్న నితిన్ ఈసారి మళ్ళీ తన పాత స్కూల్ కే వచ్చినట్టు తెలిసింది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి హరీష్ జైరాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈయన పేరు చెప్పగానే మ్యూజిక్ లవర్స్ కి గుర్తొచ్చే పేర్లు ఆరంజ్, ఘర్షణ. వాటిని మించే మరో పవర్ ఫుల్ ఆల్బమ్ అయితే ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ నుంచి ఆశించవచ్చు.
This post was last modified on July 23, 2023 7:34 pm
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…