అసలు ఇంతకీ ఏ ముహూర్తంలో గుంటూరు కారంకి శ్రీకారం చుట్టారో ఓసారి చెక్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి మార్పుల ప్రహసనం అంతులేని కథగా సాగుతూనే ఉంది. తాజాగా కెమెరా మెన్ పీఎస్ వినోద్ తప్పుకుని ఆ స్థానంలో రవి కె చంద్రన్ వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. యూనిట్ అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ వార్త గుప్పుమని ఫిలిం నగర్ వర్గాల్లో తిరుగుతూనే ఉంది. వినోద్ గతంలో త్రివిక్రమ్ తో కలిసి అల వైకుంఠపురములోతో పాటు అరవింద సమేత వీర రాఘవకు పని చేశారు. వాటి క్వాలిటీ అవుట్ ఫుట్ లో ఆయన పాత్ర ఎంత వుందో ప్రత్యక్షంగా చూశాం.
మహేష్ బాబు ప్రస్తుతం వెకేషన్ కోసం విదేశాలకు వెళ్ళిపోయాడు. ఈసారి ట్రిప్ మూడు నాలుగు వారాలు జరిగేలా ఉంది. ఈలోగా ఇంకేమైనా రిపేర్లు , ఆర్టిస్టుల కాల్ షీట్లకు సంబంధించిన సమస్యలు ఉంటే త్రివిక్రమ్ సరిచేసుకోవాలి. జూలై ఎలాగూ అయిపోయింది కాబట్టి మిగిలింది ఇంకో అయిదు నెలలు మాత్రమే. ముందు ఫిక్స్ చేసుకున్న సంక్రాంతి రిలీజ్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవద్దని అభిమానులు కోరుకుంటున్నారు. రేస్ నుంచి ప్రభాస్ కల్కి తప్పుకోవడం దాదాపు ఖాయమవ్వడంతో పండగ సీజన్ ని మహేష్ అయితే బాగా వాడుకుంటాడని ఆశిస్తున్నారు.
ఫైనల్ గా ఏం జరుగుతుందో ఇప్పటికైతే చెప్పలేం కానీ ఈ పరిణామాలు బజ్ మీద ప్రభావం చూపించేలా ఉన్నాయి. మహేష్ ఫ్యాన్స్ క్రమంగా రాజమౌళి ప్రాజెక్టు మీద ఆసక్తి పెంచుకుంటున్నారు. త్రివిక్రమ్ ని తక్కువంచనా వేయడానికి లేకపోయినా ఇన్నేసి సార్లు షాకులు తగులుతుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి రెండో కథానాయిక. తమన్ సంగీతం సంగతి ఇంకా తేలనే లేదు. అసలు పాటల కంపోజింగ్ అయిపోయిందో లేదో ఆ వార్త కూడా బయటికి రానివ్వకుండా గుట్టు మైంటైన్ చేస్తున్నారు. రిలీజ్ దాకా ఈ ట్విస్టులు తప్పవేమో.
This post was last modified on July 22, 2023 6:52 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…