ఎప్పుడూ ట్విట్టర్లో సినిమాల గురించే మాట్లాడే టాలీవుడ్ హీరోలు రాజకీయాల గురించి సీరియస్‌గా మాట్లాడితే షాకవ్వాల్సందే. యువ కథానాయకుడు రామ్ ఇలాగే శనివారం అందరికీ షాకిచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పేరు చెడగొట్టేలా కొందరు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారంటూ అతను ట్వీట్ వేసి ఆశ్చర్యపరిచాడు.
దీనికి కారణం విజయవాడలో కొన్ని రోజుల కిందట కోవిడ్ హాస్పిటల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం చుట్టూ ముసురుకున్న వివాదమే కారణం. అక్కడి స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ కేర్ సెంటర్ నడుపుతున్న రమేష్ హాస్పిటల్.. రామ్ కుటుంబ సభ్యులదే అన్న సంగతి ఇప్పటికే బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.
ఫైర్ సేఫ్టీ చూసుకోకుండా స్వర్ణ ప్యాలెస్‌లో ఆసుపత్రి ఏర్పాటు చేసిన రమేష్ హాస్పిటల్‌దే అగ్ని ప్రమాదానికి బాధ్యత అని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రామ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. రమేష్ హాస్పిటల్ స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడానికి మూడు వారాల ముందు ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నడుపుతోందని.. అప్పుడు ప్రమాదం జరిగి ఉంటే ప్రభుత్వానిదే బాధ్యతా అని ప్రశ్నించాడు రామ్.
ఆసుపత్రి ఏర్పాటు తర్వాత కూడా స్వర్ణ ప్యాలెస్ అందులో దిగే అతిథులకు బిల్లులు ఇచ్చిందని.. అంటే భవనం వారి ఆధ్వర్యంలోనే ఉందని.. అలాంటపుడు అగ్ని ప్రమాదానికి రమేష్ హస్పిటల్ వారిని ఎలా బాధ్యులు చేస్తారని అతను ప్రశ్నిస్తున్నట్లుంది. ఈ వ్యవహారంలో ఏపీ సీఎంను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని.. సీఎం గమనించాలని రామ్ అన్నాడు. #apiswatching అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి అతను ఈ వ్యవహారంపై వరుసగా ట్వీట్లు గుప్పించాడు.
This post was last modified on August 15, 2020 4:12 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…