Movie News

విజయ్ ఆంటోనీకి మళ్ళీ నిరాశే

ఇన్నేళ్ల కెరీర్ లో ఒక్క బిచ్చగాడు తప్ప చెప్పుకోదగ్గ పెద్ద హిట్టు మరొకటి లేని విజయ్ ఆంటోనీ నిన్న హత్యతో థియేటర్లలో అడుగు పెట్టాడు. విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ ఎంతో కొంత వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. బాలాజీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ డ్రామాలో వెంకటేష్ గురు ఫేమ్ రితిక సింగ్ ప్రధాన పాత్ర పోషించగా గుంటూరు కారం ఆఫర్ పట్టేసిన మీనాక్షి చౌదరి కీలకమైన క్యారెక్టర్ దక్కించుకుంది. అయితే ఫలితం, టాక్, రివ్యూలు అన్నీ విజయ్ ఆంటోనీకి ప్రతికూలంగానే ఉన్నాయి.

ఇదో అరిగిపోయిన స్టోరీ లైన్. ప్రముఖ మోడల్ లైలా(మీనాక్షి చౌదరి) హత్యకు గురవుతుంది. ఇన్స్ పెక్టర్ సంధ్య(రితిక సింగ్)కు కేస్ ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాక అయోమయపడుతుంటే డిటెక్టివ్ వినాయక్(విజయ్ ఆంటోనీ) రంగంలోకి దిగి ఒక్కొక్కరిని విచారించడం మొదలుపెడతాడు. లైలాతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వాళ్ళతో పాటు అందరినీ విచారిస్తాడు. ఈ క్రమంలో ఎన్నో చిక్కుముళ్లు ఎదురవుతాయి. వాటిని దాటుకుని హంతకుడిని పట్టుకుంటాడు. ఎప్పటిలాగే పెద్దగా నటన అవసరం లేని పాత్రలో విజయ్ ఆంటోనీ సీరియస్ యాక్టింగ్ తో బండి లాగించాడు.

ఏ మాత్రం ఆసక్తి రేపని స్క్రీన్ ప్లేతో హత్య చాలా నీరసంగా సాగుతుంది. దానికి తోడు పంటి కింద రాళ్ళలా పాటలు అడ్డం పడితే స్లో నెరేషన్ కేవలం గంట లోపే ఉన్న ఫస్ట్ హాఫ్ సైతం విపరీతంగా బోర్ కొట్టేలా చేసింది. దాదాపు సినిమా మొత్తం రెండు మూడు ఇంటీరియర్ లొకేషన్లలో చుట్టేయడంతో బాగా విసుగొస్తుంది. నేపధ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. రాధికా శరత్ కుమార్, మురళి శర్మ, జాన్ విజయ్ లాంటి క్యాస్టింగ్ ని  వేస్ట్ చేసుకున్నారు. ఓటిటిలో ఏదో ఫార్వార్డ్ చేసుకుంటూ ట్రై చేయోచ్చు కానీ రెండుంపావు గంటలు టికెట్ కొని భరించడం కష్టమే. బిచ్చగాడు హీరోకి మళ్ళీ నిరాశ తప్పలేదు. 

This post was last modified on July 22, 2023 10:50 am

Share

Recent Posts

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

4 hours ago

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

11 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

11 hours ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

12 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

14 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

14 hours ago