బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. విడుదలైన ప్రతి చోటా ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు, రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం అది.
అంతేకాదు, రష్యా, జర్మనీ, పాకిస్తాన్, చైనా, జపాన్ వంటి పలు భాషల్లోకి ఈ చిత్రాన్ని అనువదించారు. ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదమై ఆయా దేశాల్లో ప్రదర్శితమై అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన ఈ సినిమాకు అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు వచ్చాయి.
దర్శక ధీరుడు జక్కన్న మలిచిన ఈ సినీ శిల్పం తాజాగా మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రభాస్ ను పాన్ ఇండియా హీరోగా మార్చిన ఈ చిత్రాన్ని తాజాగా మంగోలియా భాషలోకి అనువదించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 16న మంగోలియాలోని ‘టీవీ-5’ చానెల్లో బాహుబలి చిత్రం ప్రదర్శించబోతున్నారు.
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగోలియాలోని ఇండియన్ మంగోలియాలోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఇండియన్ ఫిలిం ఫెస్టివల్’ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బాహుబలి చిత్రాన్ని అక్కడి చానెల్ ‘TV-5’ లో ఆగస్టు 16న ప్రదర్శిస్తున్నారు. మంగోలియా భాషలో బాహుబలిని స్థానికులు వీక్షించనున్నారు.
దీంతోపాటు, ఆగస్టు 15న కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషించిన బాలీవుడ్ హిట్ మూవీ ‘క్వీన్’ మంగోలియా భాషలో ప్రసారం చేయనున్నారు. ఆగస్టు 17న మరో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ నటించిన ‘నీర్జా’ బయోపిక్ మంగోలియా భాషలో ప్రదర్శించనున్నారు.
This post was last modified on August 15, 2020 3:49 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…