హిరణ్య కశ్యప అనగానే అందరికీ చాలా ఏళ్ల నుంచి గుర్తుకు వస్తున్న పేరు గుణశేఖర్‌దే. తన కెరీర్ క్లోజ్ అయిపోయిందనుకుంటున్న సమయంలో భారీ బడ్జెట్లో ‘రుద్రమదేవి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీ తీసి, దాన్ని హిట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన గుణ.. ఆ తర్వాత అంతకుమించిన సాహసోపేతమైన ‘హిరణ్యకశ్యప’ సినిమా తీయాలనుకున్నాడు.
రానా దగ్గుబాటిని హీరోగా అనుకుని సురేష్ బాబును నిర్మాణానికి ఒప్పించి ఈ ప్రాజెక్టును ఘనంగా అనౌన్స్ చేశాడు. కానీ ఏవో కారణాలతో ఆ ప్రాజెక్టును తాత్కాలికంగా ఆపి ‘శాకుంతలం’ సినిమా తీశాడు గుణ. దీని తర్వాత కచ్చితంగా ‘హిరణ్యకశ్యప’ను పట్టాలెక్కిస్తాడనే అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన్ని పక్కన పెట్టి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు సొంతంగా ‘హిరణ్య కశ్యప’ తీయడానికి రెడీ అయిపోయారు. దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. త్రివిక్రమ్ రైటర్ కాగా.. దర్శకుడెవరన్నది ఇంకా ప్రకటించలేదు.
రానా ‘హిరణ్య కశ్యప’ను అనౌన్స్ చేయగానే.. గుణశేఖర్ నర్మగర్భమైన ట్వీట్ ఒకటి వేశాడు. దేవుడి మీద సినిమా తీస్తూ తప్పు చేస్తే దేవుడు ఊరుకోడన్నట్లుగా ఆయన మాట్లాడాడు. పరోక్షంగా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ల నైతికతను ప్రశ్నించాడు. ఐతే ఇలా జస్ట్ ఒక ట్వీట్ వేసి ఈ వివాదానికి గుణశేఖర్ తెరదించేస్తాడా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ‘హిరణ్య కశ్యప’ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందే ఆయన.
దీని మీద కొన్నేళ్ల పాటు ఆయన పని చేశాడు. డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు. తీరా చూస్తే ప్రాజెక్టుకు పునాది వేసిన వ్యక్తినే పక్కన పెట్టి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు ఈ సినిమా తీయడానికి రెడీ అయిపోయారు. గుణశేఖర్ తనకేదైనా అన్యాయం జరిగితే ఊరుకునే టైపు కాదు. గతంలో ‘కత్తి’ సినిమా టైటిల్ విషయంలో, ‘రుద్రమదేవి’ సినిమాకు ఏపీలో పన్ను మినహాయింపు రానపుడు ఆయన ఊరుకోలేదు. అన్యాయాన్ని నిర్భయంగా ప్రశ్నించాడు. అలాంటిది ఇప్పుడు తనెంతో కష్టపడి ఒక డ్రీమ్ ప్రాజెక్టులా చేయాలనుకున్న సినిమా విషయంలో అన్యాయం జరిగితే వదిలేస్తాడా అన్నది ప్రశ్న.
ఇంతకుముందే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందిస్తే తాను ఊరుకోనని సంకేతాలు ఇచ్చాడు. కాకపోతే ‘శాకుంతలం’తో బాగా దెబ్బ తిన్న గుణ ఇప్పుడు ఎంత మేర పోరాడతాడు.. పెద్ద డిజాస్టర్ తర్వాత ఈ సినిమాను అనుకున్నట్లుగా తీయగలడా.. పెట్టుబడి పెట్టేదెవరు. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ఆయన పంతం పట్టి తీయాలనుకున్నా రానా అయితే ఈ ప్రాజెక్టులోకి రాడు. ఈ పరిస్థితుల్లో గుణ ఏం చేస్తాడో చూడాలి.
This post was last modified on July 21, 2023 10:08 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…