Movie News

నాగ్ అశ్విన్ క్రియేటివిటీ మీద సందేహాలా

నిన్న భారీ అంచనాల మధ్య వచ్చిన ప్రాజెక్ట్ కెలో ప్రభాస్ ఫస్ట్ లుక్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ నుంచి అధిక శాతం మిశ్రమ స్పందన దక్కించుకుంది. వాటిలో నెగటివిటీనే ఎక్కువగా ఉంది. నిజానికి వైజయంతి మూవీస్ ఈ పోస్టర్ బయటికి రాగానే నేషన్ వైడ్ హాట్ టాపిక్ గా మారుతుందని అంచనా వేసింది. కానీ దానికి రివర్స్ లో ఫీడ్ బ్యాక్ రావడంతో అదే లుక్ కి కొన్ని మార్పులు చేసి ఇమేజ్ డిలీట్ చేసి కొత్తది పెట్టింది. అయినా పెద్దగా లాభం లేదు. వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె అనే టైటిల్ తీసేయడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ లో చేసిన చిన్న చేంజెస్ గుర్తుపట్టేలా కూడా లేవు.

దీని సంగతి కాసేపు పక్కనపెడితే ఈ విషయంలో దర్శకుడు నాగ అశ్విన్ వైపే అందరి వేళ్ళు వెళ్తున్నాయి. మహానటి లాంటి ట్రాజెడీ బయోపిక్ ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించి బ్లాక్ బస్టర్ సాధించిన ఈ క్రియేటివ్ జీనియస్ ఒక సూపర్ హీరో మూవీని ఓ రేంజ్ లో డీల్ చేస్తాడని నమ్మకం పెట్టుకోవడం సహజం. అయితే కేవలం చలనం లేని ఒక్క పోస్టర్ తోనే అతని ప్రతిభను తక్కువ అంచనా వేయలేం కానీ డిజైన్ టైంలోనే కనీస జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. ప్యాన్ వరల్డ్ గా ప్రమోట్ చేసుకుంటున్నప్పుడు ప్లానింగ్ అవసరం. ఇక్కడ కొంత నిర్లక్ష్యం కనిపించింది.

రేపు రాబోయే టీజర్ వీటికి సమాధానం చెప్పాల్సిందే. లేదంటే ప్రతికూలత ఇంకా పెరిగిపోతుంది. అసలే ప్రభాస్ హ్యాట్రిక్ డిజాస్టర్స్ తో ఉన్నాడు. సలార్ మీద గ్యారెంటీ బ్లాక్ బస్టరనే టాక్ ఉంది కానీ అంతకు మించి ప్రాజెక్ట్ కె మీద ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. శాన్ డియెగో వేదిక పై ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకునేలతో పాటు అశ్విన్ తదితరులు టీజర్ ని లాంచ్ చేయబోతున్నారు. ఇందులో కూడా మరీ ఓవర్ ఎగ్జైట్ మెంట్ గురి చేసే కంటెంట్ ఉండకపోవచ్చని, కేవలం ప్రభాస్ ని రివీల్ చేయడానికి పరిమితం చేశారని ఇన్ సైడ్ టాక్. ఇంకో కొన్ని గంటల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికేస్తుంది.

This post was last modified on July 20, 2023 8:22 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

1 hour ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

3 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

4 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

4 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

4 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

4 hours ago