ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే విజువల్ గ్రాండియర్లే కావాలనే భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయి. తక్కువ బడ్జెట్ లో తీసిన వాటిని కేవలం ఓటిటిలోనే చూస్తారనే కామెంట్స్ కు 2023లో చెంపపెట్టు సమాధానాలు దొరికాయి. ప్యాన్ ఇండియా కాకపోయినా రికార్డులు బద్దలు కొట్టొచ్చని అప్ కమింగ్ డైరెక్టర్లు ఋజువు చేస్తున్నారు. బలగం తీసేనాటికి వేణు యెల్దండికి ఎలాంటి అనుభవం లేదు. కానీ రూపాయికి పదింతల లాభంతో పాటు వందకు పైగా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. నిర్మాత జేబులు నింపి ఆడియన్స్ మనసులను గొప్ప భావోద్వేగాలతో గెలిచేసుకుంది.
సామజవరగమన రిలీజ్ కు ముందు ఎలాంటి అంచనాలు లేవు. శ్రీవిష్ణు మూడు డిజాస్టర్లతో కొండ అంచున నిలబడ్డాడు. కట్ చేస్తే సింపుల్ కామెడీతో రామ్ అబ్బరాజు మెప్పించిన తీరు నెల తిరక్కుండానే నలభై కోట్ల గ్రాస్ ని కళ్లజూసింది. మూడు వారాల తర్వాత కూడా కలెక్షన్లు స్టడీగా ఉన్న వాటిలో దీనిదే ప్రధాన స్థానం. ఇక బేబీ సెన్సేషన్ చూస్తున్నాం. యువత వెర్రెత్తినట్టు చూస్తున్నారు. వంద కోట్ల స్టార్లకే వీక్ డేస్ లో డ్రాప్స్ ఉంటాయి. అలాంటిది ఈ యూత్ ఫుల్ స్టోరీకి హౌస్ ఫుల్ బోర్డులు పడటం మాములు సెన్సేషన్ కాదు. దర్శకుడు సాయిరాజేష్ టేకింగ్ మీద పెద్ద చర్చే జరుగుతోంది.
ఇక్కడ చెప్పినవాటికైన బడ్జెట్ ఎలా చూసుకున్నా నాలుగైదు కోట్ల కంటే ఎక్కువ కాలేదు. మూడింటిలో ఇద్దరు డెబ్యూ డైరెక్టర్లు. బిజినెస్ కూడా చాలా రీజనబుల్ గా చేశారు. దీని వల్ల నిర్మాతలతో పాటు బయ్యర్లు అందరూ లాభ పడ్డారు. కంటెంట్ ఉంటే పబ్లిక్ ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా టికెట్లు కొంటారని భారీ విజయాల సాక్షిగా ఇవి నిరూపించాయి. రైటర్ పద్మభూషణ్ లాంటివి సక్సెస్ అయ్యాయి కానీ కమర్షియల్ లెక్కలో వీటి స్థాయిలో కాదు. క్వాలిటీ మీద ఫోకస్ పెడితే కోట్లు కుమ్మరించకపోయినా మంచి సినిమాతో కోట్లు రాబట్టొచ్చని ఉదాహరణగా నిలిచిన వీటి స్ఫూర్తితో ఇంకెందరో రావాలి.
This post was last modified on July 20, 2023 4:46 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…