ఏ సినిమాకాయినా బజ్ తీసుకొచ్చే ట్రైలర్ కట్ ముఖ్యం. ఒక్క ట్రైలర్ తో టికెట్లు అమ్ముడైన సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం బ్రో మేకర్స్ కూడా ట్రైలర్ పై కసరత్తు చేస్తూ సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. తాజాగా ట్రైలర్ కట్ రెడీ చేశారు. దాని మీద త్రివిక్రమ్ , దర్శకుడు సముద్రఖని బెటర్ మెంట్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే టీజర్ తో కొంత వరకూ హైప్ తీసుకొచ్చారు. కానీ తాజాగా రిలీజైన సాంగ్స్ ఫ్యాన్స్ ను సైతం నిరాశ పరిచాయి.
దీంతో ఇప్పుడు ట్రైలర్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేసి పవన్ సినిమాకు కావలసినంత బజ్ తీసుకొచ్చే ప్లానింగ్ రెడీ చేస్తున్నారు. ట్రైలర్ తో సినిమా ఎలా ఉండబోతుందో ? ఎలాంటి ఎమోషన్ ఉండనుందో చెప్పబోతున్నారు. అలాగే తమన్ స్కోర్ కూడా థియేట్రికల్ ట్రైలర్ లో హైలైట్ అవ్వనుందని అంటున్నారు. పవన్ డైలాగ్స్ , సాయి తేజ కేరెక్టర్ , సాంగ్స్ తో ఫుల్ మీల్స్ ఉండేలా ట్రైలర్ రెడీ చేస్తున్నారు.
ఏదేమైనా బ్రో ట్రైలర్ క్లిక్ అయితే ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. మేకర్స్ కి ప్రమోషన్స్ కి చాలా తక్కువ టైమ్ ఉంది. ట్రైలర్ ఒక్కటే ప్రమోషన్స్ కి బ్రహ్మాస్త్రం లా కనిపిస్తుంది. మరి ఈ అస్త్రాన్ని మేకర్స్ ఎలా వాడుకుంటారో ? చూడాలి. తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ 21 న లేదా 22 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. 25న శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈవెంట్ కి పవన్ హాజరుకనున్నాడు.
This post was last modified on July 20, 2023 9:44 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…