ఎల్లుండి విడుదల కాబోతున్న బోలెడు సినిమాల్లో కాజల్ అగర్వాల్ నటించిన కార్తీక ఉంది. టైటిల్ లో కావాలనే తన పేరుని హైలైట్ చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తమిళ డబ్బింగ్. మేలో రిలీజైన కరుంగాపియంని రెండు నెలల తర్వాత అనువదించి తీసుకొస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ డిజాస్టర్ అయ్యింది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్ కూడా చేశారు. అయినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఇందులో రెజీనా కాసాండ్రా ఉంది. యోగిబాబు, జాన్ విజయ్ లాంటి తెలిసిన క్యాస్టింగ్ ని పెట్టారు. డీకే దర్శకుడు.
ఆ మధ్య కాజల్ దే కోస్టీ అని మరో సినిమా వదిలితే ఫస్ట్ డే ఉదయం ఆటకే జనం లేరు. అయినా ఒకప్పుడు తనకు మంచి మార్కెట్ ఉన్న మాట వాస్తవం. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోలతో ఆడిపాడినప్పుడు క్రేజ్ ఉండేది. తర్వాత వేషాలు తగ్గిపోయి పెళ్లి చేసుకుని బిడ్డకు తల్లయ్యాక చిరంజీవి, బాలకృష్ణ, కమల్ హాసన్ లాంటి సీనియర్లతో జట్టు కడుతోంది. అలాంటప్పుడు కేవలం తనను చూసి టికెట్లు కొంటారనుకోవడం కామెడీనే. ఇలా చేయడం వల్ల తాను సోలోగా చేస్తున్న సత్యభామ లాంటి కంటెంట్ సినిమాల మీద ప్రభావం పడుతుంది.
బేబీ భీభత్సంగా ఆడుతూ చాలా సినిమాలు పోటీలో ఉన్నా కూడా ఈ కార్తీకని రేస్ లో దింపడంలో ఔచిత్యం అర్థం కావడం లేదు. ఉత్తినే టైం పాస్ కి జనం థియేటర్లకు రావడం లేదు. టాకులు రివ్యూలు అన్నీ చూసుకుంటున్నారు. మరి ఇంత ఖర్చు పెట్టిన నిర్మాతల ఉద్దేశం ఏమో మరి. సరే అరవంలో చూడలేదు ఇక్కడ ఆడుతుందనుకున్నారో ఏమో. టెక్నికల్ టీమ్ కూడా ఏమంత గ్రాండ్ గా లేదు. ట్రయిలర్ మాత్రం హారర్ తో కాజల్ ని చూసినా భయపడేంత అరివీర భీకరంగా ఉంది. ఇంత పోటీ మధ్య నలగకుండా కనీస స్థాయిలో గట్టెక్కగలిగితే గొప్పే అనుకోవాలి.
This post was last modified on July 19, 2023 5:31 pm
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…