సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ బేబీలో టైటిల్ రోల్ ని అద్భుతంగా పోషించిన వైష్ణవి చైతన్య ఇప్పుడు కుర్రాళ్ళకు హాట్ టాపిక్ గా మారింది. పలు రకాల షేడ్స్ ని అంత ఈజ్ తో పండించిన విధానం చూసి సీనియర్లు సైతం ఆశ్చర్యపోయారు. నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండతో మొదలుపెట్టి చివరి సాంకేతిక నిపుణుడి దాకా అందరూ తన మీద ప్రత్యేక ప్రశంసలు గుప్పించారు. సోషల్ మీడియాలో చిన్న వీడియోలతో ప్రస్థానం మొదలుపెట్టి అల వైకుంఠపురములో అల్లు అర్జున్ చెల్లెలి దాకా ఎన్నో చిన్న పాత్రలు చేసి ఫైనల్ గా తాను కోరుకున్న లక్ష్యమైతే చేరుకుంది.
పెద్ద విజయం వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఎవరితో చేస్తుందనే ఆసక్తి కలగడం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం వైష్ణవి చైతన్య బేబీ టైంలో ఎస్కెఎన్-మారుతీల సంయుక్త బ్యానర్ కి బేబీతో కలిపి మూడు సినిమాలకు ముందస్తు అగ్రిమెంట్ చేసిందట. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయ్యుంటే ఏమయ్యేదో కానీ ఇప్పుడు మాత్రం నిర్మాతలకు జాక్ పాటే. ఫస్ట్ రెమ్యునరేషన్ కే ఓకే చేసుకోవచ్చు లేదా పెంచడం లేకపోవడం వీళ్ళ ఛాయస్ అవుతుంది. కానీ ఈ ఒప్పందం జరిగింది లేనిది అధికారికంగా తెలిసే అవకాశం లేదు కాబట్టి ప్రకటన వచ్చే దాకా ఎదురు చూడాల్సిందే.
గీతా ఆర్ట్స్ 2 సంస్థ సిద్ధంగా పెట్టుకున్న ఒక స్క్రిప్ట్ కి తననే ఫస్ట్ ఛాయస్ గా పెట్టుకున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత విపరీతంగా ఉంది. శ్రీలీల తప్ప ఇంకొకరి గురించి ఆలోచించే పరిస్థితిలో హీరో దర్శకులు లేరు. కానీ వైష్ణవి చైతన్య గ్లామర్ పాత్రలకు సెట్ కావడం మీద కొన్ని డౌట్లు లేకపోలేదు. పెర్ఫార్మన్స్ పరంగా వేలెత్తి చూపడానికి లేదు కానీ హీరో వెనుక పడుతూ డ్యూయెట్లు పాడే బాపతు క్యారెక్టర్లు అంతగా సెట్ అవుతాయో లేదో ఒకటి రెండు సినిమాలు చేస్తే తెలుస్తుంది. ప్రస్తుతానికి తను జోడి కట్టబోయే కథానాయకుడు ఎవరో తేలడానికి టైం పట్టేలా ఉంది
This post was last modified on July 18, 2023 4:05 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…