ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం-ఇళయరాజాలది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. వారి కలయికలో వేల పాటలు రూపొందాయి. అవి వివిధ భాషల సంగీత ప్రియులను ఎంతగా అలరించాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దక్షిణాదిన సినీ సంగీతం ఉన్నంత కాలం వారి పాటలు నిలిచి ఉంటాయి.
పాటల పరంగానే కాక వ్యక్తిగతంగానూ ఆప్తమిత్రులైన ఈ ఇద్దరి మధ్య ఆ మధ్య అనుకోకుండా విభేదాలు వచ్చాయి. బాలు నిర్వహించే సంగీత కచేరీల్లో తన పాటలు వాడుకుంటున్నందుకు రాయల్టీ చెల్లించాలంటూ ఇళయరాజా నోటీసులివ్వడం కలకలం రేపింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగినట్లు వార్తలొచ్చాయి. ఆపై ఇద్దరి మధ్య బంధం ఎలా ఉందో తెలియదు.
ఐతే ఇటీవలే కరోనా బారిన పడిన బాలుకు.. శుక్రవారం ఆరోగ్యం కొంచెం విషమించి ఐసీయూలో చేరారని, వెంటిలేటర్ మీదికి వెళ్లారని వార్తలు రావడంతో అందరిలాగే ఇళయరాజా కూడా కలత చెందారు. తన మిత్రుడి కోసం ఆప్యాయంగా ఒక వీడియో సందేశం పంపారు.
“బాలూ.. త్వరగా లేచిరా. నీకోసం ఎదురు చూస్తున్నాం. మన జీవితాలు కేవలం సినిమాలతోనే ముగిసిపోయేవి కావు. సినిమాలతో మొదలైనవీ కావు. ఎక్కడో స్టేజ్ కచేరీల్లో మనమొక్కటిగా కలిసి ఆరంభించిన సంగీత ప్రయాణం మన జీవితంగానూ, మన జీవితాలకు ఆధారంగానూ మారింది. సంగీతం, స్వరాలు ఎలా ఒకదానినొకటి విడవకుండా ఉండటాయో.. ఆ స్టేజి కచేరీల్లో ఆరంభమైన మన స్నేహం కూడా ఏ కాలంలోనూ వీడిపోదు. మనం గొడవ పెట్టుకున్నా సరే.. ఆ గొడవ కూడా మన స్నేహమే. గొడవ పడకపోయినా స్నేహమే. అది నీకూ బాగా తెలుసు. నాకూ బాగా తెలుసు. అందుకే దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. నువ్వు కచ్చితంగా తిరిగి వస్తావని నా అంతరాత్మ చెబుతోంది. అది నిజవ్వాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. బాలూ.. త్వరగా రా” అని ఆ వీడియో ఉద్వేగంతో అన్నారు రాజా. తన మిత్రుడు కోరుకున్నట్లే బాలూ అనారోగ్యం నుంచి కోలుకుని త్వరగా ఆసుపత్రి నుంచి వచ్చేస్తారని ఆశిద్దాం.
This post was last modified on August 15, 2020 10:25 am
తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయపడ్డారు. వీరిలో మరో…
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…