టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలావరకు అందరూ ఒకసారి ఒక సినిమానే చేస్తుంటారు. ఒక ప్రాజెక్టు పూర్తయ్యాక ఇంకోదానికి వెళ్తారు. అక్కినేని నాగచైతన్య కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఇప్పటిదాకా అతను ఒకసారి ఒక సినిమాతోనే ట్రావెల్ చేస్తూ వచ్చాడు. ఐతే ఇప్పుడతను రూటు మారుస్తున్నట్లు సమాచారం. ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లో సమాంతరంగా పాల్గొనబోతున్నాడట చైతూ. ఇప్పటికే కార్తికేయ-2 దర్శకుడు చందూ మొండేటితో గీతా ఆర్ట్స్ బేనర్లో ఒక సినిమా ఓకే చేశాడు చైతూ.
అది అతడి కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్లో తెరకెక్కబోతోంది. ఒక గుజరాతీ కథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సినిమా నడుస్తుందని.. ఇందులో చైతూ జాలరి పాత్ర చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఐతే ఇంతలో చైతూ చేయబోయే మరో సినిమా గురించి అప్‌డేట్ బయటికి వచ్చింది. మజిలీ తర్వాత శివ నిర్వాణతో చైతూ ఇంకో సినిమా చేయబోతున్నాడంటున్నారు.
ప్రస్తుతం ఖుషిని రిలీజ్‌కు రెడీ చేస్తున్న శివ.. చైతూకు ఒక ప్రేమకథ చెప్పి ఒప్పించాడని.. ఈ ఏడాది చివర్లో ఆ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని అంటున్నారు. అలా అయితే చందూ మొండేటి సినిమా పరిస్థితి ఏంటి అనే సందేహాలు కలిగాయి. కానీ ఈ రెండు చిత్రాలను ఒకదాని తర్వాత ఒకటి మొదలుపెట్టి.. మార్చి మార్చి డేట్లు కేటాయిస్తూ సమాంతరంగా రెండు చిత్రాలను పూర్తి చేస్తాడట చైతూ. ఇదే నిజమైతే రెండు సినిమాలకు లుక్ పరంగా ఎలా వేరియేషన్ చూపిస్తాడన్నది ఆసక్తికరం. అలాగే ఈ రెండు పడవల ప్రయాణం ఎలా సాఫీగా సాగుతుందో కూడా చూడాలి.
This post was last modified on July 18, 2023 12:06 am
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…