రెండు వారాల కిందట ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన ‘సామజవరగమన’ అనే చిన్న సినిమా. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న శ్రీ విష్ణు ఇందులో హీరో. తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేని రెబా మోనికా అనే అమ్మాయి హీరోయిన్. ఈ చిత్ర దర్శకుడు రామ్ అబ్బరాజుది ఒక సినిమా అనుభవం. ఆ సినిమా (వివాహ భోజనంభు) కూడా నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఇలాంటి కాంబినేషన్లో వచ్చిన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మహా అయితే ఓ 20 కోట్ల గ్రాస్ కలెక్షన్ల రేంజికి వెళ్తుందని అనుకుంటాం.
కానీ ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్ల మైలురాయికి చేరువ కావడం అనూహ్యమైన విషయం. కొవిడ్ తర్వాత ప్రేక్షకులను చిన్న సినిమాల కోసం థియేటర్లకు రప్పించడం చాలా కష్టం అయిపోతుందని అందరూ అనుకుంటున్నారు కానీ.. వాళ్లు ఇంటిల్లిపాదీ చూసే సినిమా వస్తే మునుపటి కంటే బాగా థియేటర్లకు వస్తున్నారనడానికి ‘సామజవరగమన’ రుజువుగా నిలిచింది.
కేవలం ఒక వీకెండ్ వరకు ఊపు చూపించి తర్వాత డౌన్ అయిపోలేదు ‘సామజవరగమన’. వీక్ డేస్‌లోనూ సినిమా బలంగా నిలబడింది. రెండో వీకెండ్లో అయితే కొత్త సినిమాలాగా హౌస్ ఫుల్ వసూళ్లతో సాగింది. ‘బేబి’ వచ్చే వరకు ఈ సినిమా జోరు తగ్గలేదు. ‘బేబి’తో పాటు మరి కొన్ని చిత్రాలు రిలీజైనా.. ప్రేక్షకుల సెకండ్ ఛాయిస్ ‘సామజవరగమన’నే అయింది. ‘బేబి’ ఓవర్ ఫ్లోస్ ఈ సినిమాకు గత వీకెండ్లో కలిసొచ్చాయి. దీంతో సినిమా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయి ముంగిట నిలిచింది.
అంటే షేర్ రూ.30 కోట్ల దాకా ఉండబోతోందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యుఎస్‌లోనూ ‘సామజవరగమన’ అదరగొట్టింది. అక్కడ ఏకంగా మిలియన్ డాలర్ల మార్కు మీద కన్నేసింది. గత శనివారం వసూళ్ల తర్వాత ఈ మైలురాయిని అందుకోవడానికి 25 వేల డాలర్లే తక్కువ పడ్డాయి. ఆదివారం రన్ పూర్తయ్యేటప్పటికీ ఆ మైల్‌స్టోన్ పూర్తయి ఉండొచ్చు. లేదా నేడో రేపో పనైపోవచ్చు. ఇలాంటి చిన్న సినిమా.. ఇలాంటి మైలురాళ్లను అందుకోవడం అనూహ్యం.
This post was last modified on July 17, 2023 5:24 pm
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…