ముందు కామెడీ వేషాలు వేసి.. ఆ తర్వాత తనకు మాత్రమే సెట్టయ్యే ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ లాంటి సినిమాల్లో హీరోగా నటించి మెప్పించిన నటుడు కృష్ణుడు. కొన్నేళ్లు మంచి ఫాంలో కనిపించిన అతను.. ఆ తర్వాత ఉన్నట్లుండి సినిమాల నుంచి అంతర్ధానం అయ్యాడు. మధ్యలో కొంత కాలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు.
తర్వాత వార్తల్లో లేని కృష్ణుడు.. ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతడి నిర్మాణంలో తెరకెక్కిన తొలి చిత్రం.. మై బాయ్‌ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్. జయరాం లోతుగెడ్డ దర్శకుడు. ‘తొలి ప్రేమ’ సహా కొన్ని సినిమాల్లో నెగెటివ్ రోల్స్‌తో ఆకట్టుకున్న శివకుమార్ ఇందులో హీరోగా నటించగా.. హర్షిత చౌదరి, వర్షా రెడ్డి కథానాయికలుగా నటించారు.
దీని ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. పేరుకు తగ్గట్లే ప్రస్తుత ట్రెండుకు తగ్గ బోల్డ్ ఫిలిం ఇదని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’లో హీరో మాదిరి ఒకే సమయంలో ఇద్దరమ్మాయిల్ని ప్రేమించే అబ్బాయి కథ ఇది.
‘‘మీద పార్ట్ మధు కావాలంటుంది. కింది పార్ట్ మాత్రం బ్రిట్నీ కావాలంటుంది బావా’’.. అంటూ హీరో చెప్పే డైలాగ్ ఈ సినిమా ఎసెన్స్ ఏంటో తెలియచేస్తుంది. ఈ ఇద్దరు అమ్మాయిల కోసం హీరో పడే పాట్లు.. వాళ్లిద్దరూ ఇతడితో ఆడే ఆటల నేపథ్యంలో సినిమా నడిచేలా ఉంది. కొన్ని కామెడీ పంచులు బాగానే పేలాయి. సినిమా అయితే ఇప్పటి యూత్‌కు నచ్చేలా సరదాగా, రొమాంటిగ్గా సాగేలా ఉంది. త్వరలోనే నేరుగా ఓటీటీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని కృష్ణుడు ప్లాన్ చేస్తున్నాడు.
This post was last modified on August 15, 2020 3:54 pm
హనుమాన్, మిరాయ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించడంతో పెద్ద రేంజికి వెళ్లిపోయాడు తేజ సజ్జా. ఐతే ఈ…
ఔను! నిజం. మీరు చదివింది అక్షరాలా కరెక్టే!. సెకను అంటే రెప్పపాటు కాలం. ఈ రెప్పపాటు కాలంలోనే అఖిలాండ కోటి…
భద్రాద్రి కొత్తగూడెంలో డా.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…
ఏపీలో ఒక చిన్న పురుగు ప్రజల్లో టెన్షన్ రేకెత్తిస్తోంది. దాని కారణంగా స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వస్తుంది. అసలు…
కొన్ని రోజుల కిందట కోనసీమ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన…
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…