కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హను ఒక కీలక పాత్రకు ఎంపిక చేశారన్న టాక్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. శాకుంతలంలో సమంతా కొడుకు భరతుడిగా నటించిన అర్హకు ఆ సినిమా ఎంత డిజాస్టరైనా నటన, ఎక్స్ ప్రెషన్లను తనకు మంచి పేరు తెచ్చింది. సామ్, దేవ్ మోహన్ లాంటి సీనియర్లకు ధీటుగా మెప్పించిన తీరు ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఫలితం పక్కనపెడితే తనకో స్వీట్ మెమరీగా నిలిచిన మాట వాస్తవం. తండ్రిగా బన్నీ కూడా స్క్రీన్ మీద అర్హను చూసుకుని మురిసిపోయాడు.
దేవరలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అవసరం ఉండటంతో దానికి అర్హని అడిగినట్టు తెలిసింది. అయితే అంగీకారం వచ్చింది లేనిది ఇంకా తెలియదు. తారక్ బన్నీల మధ్య బావా అని పిలుచుకునేంత స్నేహం ఉంది. ట్విట్టర్ లో పరస్పరం అలా సంబోధించుకోవడం చూశాం. ఒకవేళ నిజంగా అడిగి ఉంటే మాత్రం అల్లు ఫ్యామిలీ నో చెప్పకపోవచ్చు. దేవర ఇటీవలే కీలక యాక్షన్ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. త్వరలోనే మరో ఫైట్ ఎపిసోడ్ ని షూట్ చేయబోతున్నారు. బాగా బిజీగా ఉన్న అనిరుద్ రవిచందర్ పాటల కంపోజింగ్ అవ్వగానే వాటి చిత్రీకరణకు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 5 విడుదల మిస్ కాకుండా యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడనే లీక్ వచ్చింది కానీ అదెంత వరకు నిజమో తెలియదు. సముద్రపు బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ డ్రామాగా దేవర రూపొందుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎలాంటి ఒత్తిడి లేకుండా తగినంత సమయం వచ్చేలా తారక్ శివ ఇద్దరూ ఒక అండర్ స్టాండింగ్ తో ఉన్నారు. సోలో హీరోగా ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజయ్యే తారక్ మొదటి సినిమాగా దేవర మీద ఫ్యాన్స్ ఆశలు అన్నీ ఇన్నీ కావు. మరి ఫ్రెండ్ కోసం అర్హ నటించడానికి బన్నీ ఎస్ అంటాడా. చూద్దాం.
This post was last modified on July 17, 2023 3:43 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…