Movie News

బేబి వీకెండ్ – పట్టిందల్లా బంగారమే

ఊహించని స్థాయిలో నిన్న బాక్సాఫీస్ వద్ద బేబీ వసూళ్ల హంగామా జరిగింది. మొదటి రోజు ఓ మోస్తరు థియేటర్లలో రిలీజైన ఈ ప్రేమకథ కేవలం మూడో రోజుకే దానికి మూడింతలు ఎక్కువ స్థాయిలో స్క్రీన్లు, షోలు పెంచుకోవడం చూసి ట్రేడ్ షాక్ అవుతోంది. ఫస్ట్ డే వచ్చిన డివైడ్ టాక్ కి భిన్నంగా టీనేజర్లు, యువత బేబీకి పొలోమని క్యూ కట్టేస్తున్నారు. అన్ని చోట్ల దాదాపు హౌస్ ఫుల్స్ పడ్డాయని రిపోర్ట్. ముఖ్యంగా ఈవెనింగ్ షోల అరాచకం ఓ స్థాయిలో ఉంది. ఇవాళ తెలంగాణ బోనాల సెలవు మరో సానూకూలాంశం కాబోతోంది. ఇంకో వారం పైగానే పెద్దగా డ్రాప్ ఉండకపోవచ్చు.

బయ్యర్ల నుంచి అందుతున్న సమాచారం మేరకు మూడు రోజులకు గాను బేబీ వసూలు చేసిన గ్రాస్ 21 కోట్ల పైమాటే ఉందట. షేర్ గా 11 కోట్ల 35 లక్షల దాకా వచ్చింది. అత్యధికంగా ఒక్క నైజం నుంచే 3 కోట్ల 90 లక్షల షేర్ వసూలు కావడం రికార్డు. సీడెడ్ కోటికి అమ్మగా డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ పాతిక లక్షల లాభంతో సొమ్ములు లెక్కబెట్టుకుంటున్నాడు. ఉత్తరాంధ్రలో కోటిన్నరకు పైగానే వచ్చింది. వెస్ట్ వెస్ట్ కలిపి కోటి పదిహేను లక్షలు, గుంటూరు 52 లక్షలు, కృష్ణా 60 లక్షలు, నెల్లూరు 35 లక్షలతో స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. ఓవర్సీస్ లోనూ కోటిన్నర దాటడం విశేషం

సుమారు ఎనిమిది కోట్ల దాకా బ్రేక్ ఈవెన్ పెట్టుకుని థియేటర్ బిజినెస్ చేసిన బేబీ నాలుగో రోజు మొదటి ఆట పడే సమయానికే 3 కోట్ల 35 లక్షల లాభంతో రన్ కొనసాగిస్తోంది. ఇవాళ నుంచి డ్రాప్ మరీ ఎక్కువ స్థాయిలో ఉండకపోవక్కని అడ్వాన్స్ బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. బిసి కేంద్రాల్లో కౌంటర్ సేల్స్ తాకిడి ఎక్కువగా ఉంది. నిన్న చాలా సెంటర్స్ లో విపరీతమైన రద్దీ కనిపించింది. ఈ లెక్కన యాభై కోట్ల గ్రాస్ మంచి నీళ్ల ప్రాయంగా కనిపిస్తోంది. జాతిరత్నాలుని క్రాస్ చేయడం అసాధ్యంగా అనిపించడం లేదు. ఫైనల్ గా ఎలాంటి మేజిక్ ఫిగర్స్ నమోదవుతాయో చూడాలి. 

This post was last modified on July 17, 2023 3:36 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

2 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

2 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

3 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

4 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

4 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

10 hours ago