Movie News

జైలర్ మెడకు టైటిల్ వివాదం

వచ్చే నెల 10న విడుదల కాబోతున్న కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాకు టైటిల్ వివాదం చుట్టుముట్టింది. కేరళకు చెందిన దర్శక నిర్మాత సక్కిర్ మదత్తిల్ 2021లోనే ఈ పేరుని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించుకున్నారు. గడువు ముగిశాక రెన్యూవల్ కూడా అయ్యిందట. కానీ షూటింగ్ పూర్తయినప్పటికీ పలు కారణాల వల్ల విడుదల సాధ్యం కాలేదు. గతంలో దీని టైటిల్ లాంచ్ ని దుబాయ్ లో నిర్వహించినప్పుడు కమల్ హాసన్ అతిథిగా హాజరయ్యారు. ధ్యాన్ శ్రీనివాసన్ హీరోగా నటించిన జైలర్ కు మల్టీ లాంగ్వేజ్ లోనే ప్లాన్ చేసుకున్నారట.

ఇప్పుడీ వ్యవహారం మద్రాస్ హైకోర్టుకి చేరింది. ఆగస్ట్ 2న దీనికి సంబంధించిన తీర్పు వెలువడే అవకాశాలున్నాయి. ఒకవేళ రజని ప్రొడ్యూసర్లకు వ్యతిరేకంగా జడ్జ్ మెంట్ వస్తే ఇబ్బందే. ఎందుకంటే కేరళలో మలయాళంతో సమానంగా తమిళ వెర్షన్ కూడా ఆడుతుంది. అలాంటప్పుడు రెండు భాషలకు వేర్వేరు పేర్లు పెడితే ఆడియన్స్ అయోమయం చెందుతారు. అందుకే మధ్యవర్తిత్వం ద్వారా దీన్ని పరిష్కరించుకునే విధంగా తెరవెనుక చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. అయినా షూటింగ్ మొదలైనప్పుడే జైలర్ అని పెడితే ఇప్పుడు కేసు పెట్టడం ఏమిటో.

రిలీజ్ కు ఇంకో ఇరవై నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో టీమ్ పబ్లిసిటీ మీద దృష్టి పెడుతోంది. తెలుగులో చిరంజీవి భోళా శంకర్, హిందీలో గదర్ 2, ఓ మై గాడ్ 2 గట్టి పోటీ ఇవ్వబోతున్నాయి. తమన్నాతో చేయించిన కావాలయ్యా పాట మెల్లగా మాస్ కి ఎక్కేస్తోంది. ముందు నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినప్పటికీ అనిరుద్ రవిచందర్ సంగీతం క్రమంగా రీచ్ అవుతోంది. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లు జైలర్ లో ప్రత్యేక క్యామియోలు చేయడం అంచనాలు పెంచుతోంది. సునీల్ కూడా స్పెషల్ రోల్ చేశాడు. తెలుగు మార్కెట్ బాగా తగ్గిపోయిన రజని ఆశలన్నీ జైలర్ మీదే ఉన్నాయి

This post was last modified on July 17, 2023 8:46 am

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

2 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

3 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

4 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

8 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

8 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

10 hours ago