ఇంకో రెండు వారాల్లోపే విడుదల కాబోతున్న బ్రో తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. ఫైనల్ లెన్త్ ని 2 గంటల 15 నిమిషాలకు లాక్ చేయడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో కనీసం రెండున్నర గంటల స్క్రీన్ టైం ఆశిస్తే దానికి భిన్నంగా స్వీట్ అండ్ షార్ట్ వెర్షన్ కి వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించింది. పవర్ స్టార్ ఎంట్రీ మొదటి ఇరవై నిమిషాల తర్వాత ఉంటుందని ఆల్రెడీ లీకైపోయింది. దానికి తోడు తన నిడివి తొంబై నిమిషాలనే వార్త కూడా ఈ మధ్యే బయటికి వచ్చింది.
ఈ నేపథ్యంలో బ్రోకు ఇంత క్రిస్పీ టైంకి సెట్ చేయడం ఒకరకంగా మంచి విషయమే. ఎందుకంటే తక్కువ లెన్త్ ఉండటం అదనంగా షోలు ప్లాన్ చేసుకోవటానికి, త్వరగా ప్రదర్శనలు పూర్తి చేసుకుని ఆడియన్స్ ఇంటికి వెళ్లిపోవడానికి అవకాశం ఉంటుంది. పైకి హడావిడి చేయకపోయినా బిజినెస్ మాత్రం అంతర్గతంగా హాట్ కేక్ లా జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. నైజామ్ హక్కులను మైత్రికి ముప్పై రెండు కోట్లకు అమ్మారనే ట్రేడ్ గుప్పుమంటోంది. ఉస్తాద్ భగత్ సింగ్ కు వీళ్ళే ప్రొడ్యూసర్లన్న సంగతి తెలిసిందే. ఆంధ్ర రైట్స్ కూడా ఇంకో రెండు మూడు రోజుల్లో సెటిల్ చేస్తారు.
బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరో సినిమా వచ్చి గ్యాప్ వచ్చేసింది కనక బ్రోకు యావరేజ్ టాక్ వచ్చినా చాలు కలెక్షన్లు కుమ్మేస్తుంది. లేదూ సూపర్ హిట్ అనిపించుకుందా ఏకంగా రికార్డుల మీదే కన్నేయొచ్చు. పవన్ డబ్బింగ్ తాలూకు పని ఇంకా బ్యాలన్స్ ఉంది. దానికన్నా ముందే ఫైనల్ కాపీ రెడీ చేసి వీలైతే వచ్చే వారాంతంలోపు సెన్సార్ పూర్తి చేసేలా దర్శకుడు సముతిరఖని ట్రై చేస్తున్నాడు. పవన్ వారాహి యాత్రలో విపరీతమైన బిజీలో ఉండటంతో బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్ పెద్ద టాస్క్ అవుతోంది. ఏదో ఒక డేట్ ఖాళీ చూసుకుని ఆ లాంఛనమేదో పూర్తి చేయమని నిర్మాతలు పవన్ ని రిక్వెస్ట్ చేశారట.
This post was last modified on July 15, 2023 8:01 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…