ఊహించిన దానికన్నా ఎక్కువగా బేబీ మొదటి రోజు వసూళ్లు ట్రేడ్ కి స్వీట్ షాక్ ఇచ్చాయి. టాక్ విషయంలో మిశ్రమాభిప్రాయాలు ఉన్నప్పటికీ యూత్ మాత్రం థియేటర్లకు కదులుతున్నారు. కీలక కేంద్రాల్లో ఆక్యుపెన్సీలు డెబ్భై శాతానికి పైగానే నమోదవుతున్నాయి. మొదటి వీకెండ్ పూర్తిగా బేబీ కంట్రోల్ లోకి వెళ్లబోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ దీని పట్ల అంత సుముఖంగా లేనప్పటికీ కాలేజీ కుర్రకారుతో పాటు టెన్త్ క్లాస్ బ్యాచులు, ఆటో మాస్ జనాలు ఓసారి చూద్దామని డిసైడ్ అయిపోయి అండగా నిలుస్తున్నారు. ఇక ఓపెనింగ్స్ లెక్కలైతే చిన్నపాటి సెన్సేషనే
బాబీ ఫస్ట్ డే గ్రాస్ 6 కోట్ల 50 లక్షల దాకా వచ్చిందట. షేర్ రూపంలో చూసుకుంటే 3 కోట్ల 40 లక్షల దాకా తేలుతుంది. ఈ మధ్య కొందరు పేరున్న హీరోలకు సైతం రాని ఫిగర్లివి. సీడెడ్ లాంటి ప్రాంతాల్లో మొదటి రోజే ముప్పై శాతం రికవరీ జరిగిపోయింది. షేర్ పరంగా చూసుకుంటే నైజాం 1 కోటి 18 లక్షలు, సీడెడ్ 30 లక్షలు, వైజాగ్ 40 లక్షలు, ఈస్ట్ వెస్ట్ కలిపి 30 లక్షలు, కృష్ణా 15 లక్షలు, గుంటూరు 13 లక్షలు, నెల్లూరు 8 లక్షలు ఇలా ఏపీ తెలంగాణ మొత్తం చూసుకుంటే 2 కోట్ల 55 లక్షల దాకా వచ్చిందట. ఓవర్సీస్ తో పాటు ఇతర ప్రాంతాలను కలిపి 85 లక్షలు దాకా వచ్చాయట.
శని ఆదివారాలు బుకింగ్స్ స్ట్రాంగ్ గా ఉండబోతున్నాయి. ప్రేమలో ఫెయిలైనవాళ్ళు, అమ్మాయిల చేతులో మోసపోయిన వాళ్ళు బేబీకి బాగా కనెక్ట్ అవుతున్నారు. మళ్ళీ బ్రో వచ్చేదాకా స్టార్ హీరోల రిలీజులేవి లేకపోవడం ఈ చిన్న సినిమాకు అడ్వాంటేజ్ గా మారనుంది. మహావీరుడు, నాయకుడులకు స్పందన లేకపోవడం ఇక్కడ కలిసొస్తున్న మరో అంశం. కాకపోతే ఈ దూకుడు సోమవారం నుంచి ఉంటుందా లేదానేది వేచి చూడాలి. బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఎనిమిది కోట్లకు పైగా షేర్ రావాలి. దాదాపు సగం దూరం అయిపోయింది కాబట్టి మిగిలింది పెద్ద కష్టమేమీ కాదు
This post was last modified on July 15, 2023 5:44 pm
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…