‘వరుణ్ డాక్టర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు తమిళ యువ కథానాయకుడు శివ కార్తికేయన్. ఆ తర్వాత ‘ప్రిన్స్’ అనే తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంతో మన ప్రేక్షకులను పలకరించిన అతను.. ఇప్పుడు ‘మహావీరుడు’ అవతారం ఎత్తాడు. శుక్రవారమే ఈ సినిమా రిలీజ్. తమిళంలో భారీ అంచనాలు, తెలుగులో ఓ మోస్తరు అంచనాలతో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి ఈ రోజు ఉదయం పెద్ద షాక్ తగిలింది.
అటు తమిళ నాట.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు చాలా చోట్ల మార్నింగ్ షోలు పడలేదు. కంటెంట్ సమయానికి డెలివరీ కాకపోవడంతో యుఎస్‌లో ‘మహావీరుడు’ తమిళ వెర్షన్‌కు ప్రిమియర్సే పడలేదు. తెలుగు వెర్షన్‌కు చాలా చోట్ల మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో పడాల్సిన 9 గంటల షో ఆగిపోయింది. అనేక మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లలోనూ ఉదయం షోల సమయానికి కంటెంట్ డెలివరీ కాక షోలు ఆగిపోయాయి. చాలామంది ఆడియన్స్ థియేటర్లకు వచ్చి వెనుదిరిగారు. లేదంటే వేరే సినిమాకు వెళ్లాల్సి వచ్చింది.
ఐతే ఉదయం 11 గంటల సమయానికి సమస్య తీరిపోవడంతో కొంచెం లేటుగా మార్నింగ్ షోలు షెడ్యూల్ అయిన థియేటర్లలో బొమ్మ పడింది. 11.30 ప్రాంతంలో షోలు మొదలయ్యాయి. మ్యాట్నీలకు ఎలాంటి ఇబ్బందీ లేకపోయింది. సినిమా సజావుగానే నడుస్తోంది. ఇంతకుముందు కమెడియన్ యోగిబాబును హీరోగా పెట్టి ‘మండేలా’ అనే వెరైటీ మూవీ తీసి మెప్పించిన మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. సినిమా మంచి ఎంటర్టైనర్ అంటూ మంచి టాకే వస్తోంది ‘మహావీరుడు’కి.
This post was last modified on July 14, 2023 4:01 pm
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…
అమెరికా ఇటీవల భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్…