బిగ్ బాస్ సీజన్ మొదలవుతుందంటే టీవీ ప్రేక్షకులతో పాటు మీడియాకు కూడా భలే పండుగ. అసలే లాక్ డౌన్‍లో రాసుకోవడానికి వార్తలు లేక ఇక్కట్లు పడుతోన్న టైమ్‍లో బిగ్ బాస్ స్టార్ట్ అవుతూ వుండడంతో ఇక ఆ అప్‍డేట్స్తో బోలెడంత కాలక్షేపం దొరుకుతుందని మీడియా సంస్థలు ఎదురు చూస్తున్నాయి. షో మొదలయ్యే లోగా ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలు లీక్ అవుతున్నాయి. నిజంగానే వాళ్లు షోలో వుంటారో, లేక ఊహాగానాలో వారిని నాగార్జున స్వయంగా ఇంట్రడ్యూస్ చేసే వరకు తెలీదు.
అయితే ఈ ఏడాది తక్కువ మంది కంటెస్టెంట్స్ వున్నా గట్టి వాళ్లను, బాగా ఎంటర్‍టైన్ చేసే వాళ్లను పెడుతున్నారని టాక్. ప్రతి సీజన్‍లానే ఈసారి కూడా డాన్స్ మాస్టర్‍తో పాటు ఒక సింగర్ కూడా హౌస్‍లోకి వెళుతున్నారు. ఆ డాన్స్ మాస్టర్ మరెవరో కాదు… జానీ అని చెబుతున్నారు. ప్రస్తుతం లీడింగ్ కొరియోగ్రాఫర్ అయిన జానీ మామూలుగా అయితే ఈ హౌస్‍లోకి వెళ్లేంత తీరిగ్గా వుండడు. కానీ ఇప్పుడు షూటింగ్స్ లేవు కనుక అతడు అభ్యంతరం చెప్పలేదని అంటున్నారు.
అలాగే యాక్టర్ కమ్ సింగర్ నోయెల్ కూడా ఈ సీజన్లో తన హుషారయిన పాటలతో హౌస్‍లో అలరిస్తాడట. లేడీ కంటెస్టెంట్స్ కూడా చాలా పాపులర్ ఫేసెస్ వుంటాయని అంటోన్న నేపథ్యంలో ఈ సీజన్‍పై ఉత్కంఠ మరింత పెరుగుతోంది.
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…