సరిగ్గా ఇంకో రెండు వారాల్లో విడుదల కాబోతున్న బ్రో మీద బజ్ సంగేతేమో కానీ అభిమానులు మాత్రం జనసేన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ స్పీచులను, ప్రభుత్వాన్ని ఎండగడుతున్న తీరుని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వీటి తాలూకు ప్రభావం రాజకీయ పరిణామాల మీద గట్టిగానే ఉండబోతోందన్న విశ్లేషకుల అంచనాల మధ్య ఇప్పుడు ఫ్యాన్స్ మూడ్ అంతగా బ్రో మీద లేదన్నది వాస్తవం. దానికి తోడు ప్రమోషన్ కూడా నత్తనడకన సాగుతోంది. టీజర్, లిరికల్ సాంగ్, మేకింగ్ వీడియో వదలారు కానీ అవేవీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంత రేంజ్ లో లేవన్నది నిజం.
ఇక బ్రోలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నిడివి ఎంత ఉంటుందనే దాని మీద రకరకాల ప్రచారాలు ఉన్నాయి కానీ నమ్మదగిన వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఇలా ఉంది. పవర్ స్టార్ ఎంట్రీ సినిమా మొదలైన ఇరవై నిమిషాల తర్వాత ఉంటుంది. అప్పటిదాకా ప్రైవేట్ కంపెనీలో మధ్య తరగతి ఉద్యోగిగా సాయి ధరమ్ తేజ్ కష్టాలను ఫన్నీగా చూపిస్తారు. సమయం మనిషి రూపంలో రావడం మొదలయ్యాక అక్కడి నుంచి పవన్ పాత్ర మొత్తం లెన్త్ లో తొంబై నిమిషాల దాకా వస్తుందట. అంటే ఇంకో ముప్పావు గంట తేజు, ఇతర తారాగణం మధ్య సన్నివేశాలు, పాటలతో గడిచిపోతుంది.
అయినా సరే పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆద్యంతం ఫీలయ్యేలా రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలివిగా స్క్రీన్ ప్లే రాసినట్టు వినికిడి. దర్శకుడు సముతిరఖని ఒరిజినల్ తో పోలిస్తే ఈ మార్పులు ఎక్కువే అయినప్పటికీ బిజినెస్ దృష్ట్యా కీలకం కావడంతో వాటిని అంతే పర్ఫెక్ట్ గా తెరకెక్కించారని అంటున్నారు. తమన్ మ్యూజిక్ పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ పరంగానే ఎక్కువ మెప్పిస్తుందని అంటున్నారు. పవన్ కు ప్రత్యేకంగా హీరోయిన్ తో పాటలు లేకపోయినా ఫైట్లు, ఊర్వశి రౌతేలా పబ్బు సాంగ్, మంచి టైమింగ్ ఉన్న డైలాగులు అభిమానులకు సంతృప్తి కలిగించేలా ఉంటాయట. చూద్దాం మరి.
This post was last modified on July 13, 2023 6:40 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…