కొన్నేళ్ల క్రితం రెమో లాంటి ఒకట్రెండు సినిమాలతో మెప్పించిన శివ కార్తికేయన్ కు ఇక్కడ పెద్దగా మార్కెట్ ఏర్పడలేదు. కీర్తి సురేష్, సమంతా లాంటి గ్లామర్ కోటింగ్ వల్ల సీమరాజా లాంటివి ఓపెనింగ్స్ తెచ్చినా వాటిని లాంగ్ రన్ లో నిలబెట్టుకోలేకపోయాడు. కానీ వరుణ్ డాక్టర్ విజయం సాధించాక లెక్కలు మారిపోయాయి. చాలా తక్కువ రేట్లకు బిజినెస్ చేస్తే మూడింతలు లాభం వచ్చింది. ఆ తర్వాత కాలేజ్ డాన్ సైతం హిట్టు కొట్టింది. ఏ సెంటర్ బయ్యర్లకు మంచి లాభాలు ఇచ్చింది. కానీ తెలుగు దర్శకుడు అనుదీపే తీసిన ప్రిన్స్ మాత్రం బాక్సాఫీస్ వద్ద తోకముడిచింది.
రేపు మహావీరుడుగా థియేటర్లలో అడుగుపెట్టబోతున్నాడు. ఏపీ తెలంగాణ కలిపి అయిదున్నర కోట్ల దాకా థియేట్రికల్ హక్కులు అమ్మినట్టు ట్రేడ్ టాక్. ఇది మరీ చిన్న ఫిగరేం కాదు. బ్రేక్ ఈవెన్ దాటాలంటే పధి కోట్ల దాకా గ్రాస్ రాబట్టాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. అడవి శేష్ అతిథిగా వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పాడు. శివ కార్తికేయన్ పలు టీవీ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. కానీ బజ్ కోసం ఇవి ఎంత మాత్రం సరిపోలేదు. ఏదో ఇంగ్లీష్ మూవీ డబ్బింగ్ టైటిల్ లా మహావీరుడు అని పెట్టడం కొంత మైనస్ అయ్యింది. బేబీ పోటీ వల్ల ఓపెనింగ్స్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు
సో డాక్టర్, డాన్ లాగే మహావీరుడు టాక్ మీద ఆధారపడాల్సిందే. ఏ మాత్రం అటుఇటు అయినా రెండో రోజే క్రాష్ అయిపోతుంది. ఫాంటసీ టచ్ జోడించిన ఈ యాక్షన్ డ్రామాకు రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయాన్ని కూడా హైలైట్ చేసుకోలేకపోయారు. ట్రైలర్ ఒక్కటి తప్ప ఇంకెలాంటి పబ్లిసిటీ మెటీరియల్ వదలలేదు. కౌసల్య కృష్ణమూర్తి నుంచి తెలుగు మార్కెట్ ని సీరియస్ గా తీసుకుంటున్న శివ కార్తికేయన్ కి అది నిలబడాలంటే ప్రచారం అండ కావాల్సిందే. సరైన డేట్ కి వస్తున్నారు కానీ దానికి సరిపడా హైప్ తెచ్చుకోలేదు. టాక్ ఏమైనా అద్భుతం చేస్తుందేమో చూడాలి.
This post was last modified on July 13, 2023 4:07 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…