ఛలోతో తనకు టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ దక్కేలా చేసిన దర్శకుడు వెంకీ కుడుముల అంటే రష్మిక మందన్నకు ప్రత్యేక అభిమానం, గౌరవం. వీళ్లిద్దరి రెండో కలయికలో వచ్చిన భీష్మ సైతం గ్రాండ్ సక్సెస్ కావడం సెంటిమెంట్ ని మరింత బలపరిచింది. అందుకే మూడోసారి కాంబో అనగానే ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. చిరంజీవితో సినిమా వచ్చినట్టే వచ్చి చేజారిన వెంకీ మళ్ళీ నితిన్ తోనే చేతులు కలిపాడు. మైత్రి లాంటి పెద్ద సంస్థ అండ దొరికింది. సంగీత దర్శకుడిగా జివి ప్రకాష్ కుమార్ ని తీసుకుని ఆ మేరకు ఒక వెరైటీ అనౌన్స్ మెంట్ వీడియో కూడా వదిలారు.
కానీ ఇప్పుడీ ప్రాజెక్టుని రష్మిక మందన్న వదులుకోవడానికి నిర్ణయించుకున్నట్టు ఫిలిం నగర్ టాక్. తన పర్సనల్ మేనేజర్ కిరణ్ తో వచ్చిన విభేదాల గురించి రకరకాల పుకార్లు వచ్చిన నేపథ్యంలో తనే స్వయంగా అలాంటిదేమీ లేదని, స్నేహపూర్వకంగానే వీడ్కోలు చెప్పానని క్లారిటీ ఇచ్చింది. అయితే వెంకీ కుడుముల మూవీలో మరో హీరోయిన్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసే డ్రాప్ కావాలని డిసైడ్ చేసుకుని ఆమేరకు చెప్పేసిందని అంటున్నారు. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ ఉత్తుత్తినే ఇలాంటి వార్తలు ప్రచారం కావు కాబట్టి నిజమే అయ్యుండొచ్చు .
పుష్ప తర్వాత రష్మిక కెరీర్ అమాంతం ఊపందుకుంటుందనుకుంటే వరసగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు వస్తున్నాయి కానీ ఆ మేరకు బ్లాక్ బస్టర్లు పడటం లేదు. బాలీవుడ్ లోనూ చేదు అనుభవాలే మిగులుతున్నాయి. గుడ్ బై, మిషన్ మజ్ను దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. యానిమల్ బ్రేక్ ఇస్తుందనుకుంటే విడుదల డిసెంబర్ కు వాయిదా పడింది. పుష్ప 2 షూటింగ్ కి ఎక్కువ టైం పడుతోంది కాబట్టి రిలీజ్ గురించి ఇప్పుడప్పుడే తేలేదు. ఈ నేపథ్యంలో నితిన్ సినిమా నుంచి దిగిపోవడం రైటో రాంగో కానీ మొత్తానికి తెరవెనుక చాలా మలుపులే జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.
This post was last modified on July 13, 2023 1:56 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…