న్యాచురల్ స్టార్ నాని మరోసారి ఫాదర్ సెంటిమెంట్ కే ఓటు వేశాడు. శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎమోషనల్ డ్రామాకి హాయ్ నాన్న టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ అధికారికంగా కొత్త పోస్టర్ తో పాటు టీజర్ విడుదల చేశారు. అయితే నాని ఇక్కడో ఓ చిన్న ట్విస్టు ఇచ్చారు. నాన్న అని పిలిచేది స్టిల్ లో ఉన్న చిట్టి తల్లి కాదని, పక్కనున్న అందమైన అమ్మాయని హింట్ ఇచ్చేశాడు. అంటే ఈ ముగ్గురి బాండింగ్ కు సంబంధించి కీలకమైన మలుపు చెప్పేశారు. పాప తల్లి వేరు, ఆమె దూరమయ్యాక వచ్చే యువతే మృణాల్ ఠాకూర్ అనే క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 21 హాయ్ నాన్న ప్యాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది.
దసరా ఊర మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత నాని ఉద్దేశపూర్వకంగా కొత్త మేకోవర్ కోరుకున్నాడు. దానికి తగ్గట్టే నాన్నగా మారిపోయాడు. జెర్సీలో పదేళ్ల కుర్రాడికి తండ్రిగా నటించి ఎమోషన్ తో కన్నీళ్లు పెట్టించిన న్యాచురల్ స్టార్ ఈసారి వినోదానికి పెద్ద పీఠ వేయబోతున్నట్టు తెలిసింది. విజయ్ దేవరకొండతో ఖుషితో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న హేశం అబ్దుల్ వహాబ్ దీనికి సంగీతం సమకూరుస్తున్నాడు. మ్యూజిక్ విషయంలోనూ భారీ అంచనాలున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న నానికి ఇది ఖచ్చితంగా మరో పెద్ద బ్రేక్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కూల్ టైటిల్ తో మొత్తానికి కుటుంబ ప్రేక్షకులను మరోసారి టార్గెట్ చేసిన హాయ్ నాన్నకు డిసెంబర్ చివర్లో వెంకటేష్ తో గట్టి పోటీనే ఉంటుంది. హాయ్ డాడీ సంక్రాంతికి వాయిదా పడొచ్చనే నేపథ్యంలో టీమ్ మరోసారి స్పష్టంగా నిర్ణయంలో మార్పు లేదని తేల్చి చెప్పేసింది. టాలీవుడ్ హీరోలందరూ డాడీలుగా చాలా సినిమాలు చేసినా అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకంగా నిలబడిపోయాయి. హాయ్ డాడీ కూడా వాటి సరసన నిలుస్తుందని నాని నమ్మకం. సీతారామం తర్వాత హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు మరోసారి భావోద్వేగాలు నిండిన పాత్ర దక్కింది
This post was last modified on July 13, 2023 11:34 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…