బాలీవుడ్లో ఒకప్పుడు పేరున్న గాయనీమణుల్లో సుచిత్రా కృష్ణమూర్తి. నటి, ఆర్టిస్టు కూడా అయిన సుచిత్ర.. దక్షిణాది చిత్రాల్లోనూ అనేక పాటలు పాడింది. ఆమె లెజెండరీ డైరెక్టర్ శేఖర్ కపూర్‌ను పెళ్లాడి ఒక బిడ్డను కూడా కన్నాక కొన్నేళ్లకు విడాకులు తీసుకుంది. పెళ్లయిన ఎనిమిదేళ్లకే వీరు విడిపోయారు. తమ విడాకులకు కారణం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రీతి జింతానే అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మీద విరుచుకుపడింది.
ప్రీతి తన కాపురంలో నిప్పులు పోసిందని ఆమె ఆరోపించింది. గతంలోనూ ప్రీతి మీద విమర్శలు చేయగా.. ఆమె వాటిని తిప్పి కొట్టింది. ఇప్పుడు మరోసారి ఓ ఇంటర్వ్యూలో ప్రీతి మీద విమర్శలు గుప్పించింది సుచిత్రా కృష్ణమూర్తి. ‘‘శేఖర్ నాకంటే 30 ఏళ్లు పెద్దవాడైనప్పటికీ తనను పెళ్లాడాను. మా ఇంట్లో ఈ పెళ్లికి ఒప్పుకోకపోయినా నేను ముందడుగు వేశాను. మాకు ఒక కూతురు కూడా పుట్టింది.
కానీ తర్వాత మా సంసారంలో కలతలు వచ్చాయి. మా విడాకులకు ప్రీతి జింతానే కారణం. ఆమెను నేను ఎప్పటికీ క్షమించను’’ అని సుచిత్రా కృష్ణమూర్తి తెలిపింది. మరి ఈ ఆరోపణలను ప్రీతి తిప్పికొట్టడం గురించి ప్రస్తావించగా.. ‘‘ఆమె మాటలను పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ ప్రపంచంలో ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు. ఎవరేం మాట్లాడినా సత్యానికే బలం ఉంటుంది. నేను ఒక గృహిణిగా.. 20 ఏళ్లుగా తల్లిగా ఉంటున్నందుకు గర్విస్తున్నా. ఆమెను మాత్రం ఎప్పటికీ క్షమించను. అలాగే తన గురించి పట్టించుకోను’’ అని సుచిత్రా పేర్కొంది.
This post was last modified on July 12, 2023 3:20 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…