‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ సినిమాలు చూసే వరకు నవీన్ పొలిశెట్టి టాలెంట్ ఏంటో జనాలకు అర్థం కాలేదు. అంతకుముందు 1 నేనొక్కడినే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి సినిమాల్లో నటించినపుడు నవీన్‌ను జనం లైట్ తీసుకున్నారు. కానీ హిందీలో అతను చేసిన కొన్ని షార్ట్స్, అలాగే ‘చిచ్చోరే’ సినిమాలో తన నటన చూస్తే షాకవ్వక మానరు. కొంచెం లేటుగా అతడి ప్రతిభకు తగ్గ సినిమాలు తెలుగులో పడ్డాయి.
‘జాతిరత్నాలు’ బ్లాక్ బస్టర్ కావడంతో తొందరపడి వచ్చిన ప్రతి అవకాశం ఒప్పేసుకోకుండా.. ఆచితూచి అడుగులు వేశాడు నవీన్. లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టితో అతను చేసిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఆగస్టు 4న రిలీజ్ కానున్న నేపథ్యంలో తనదైన శైలిలో సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు నవీన్.
ఈ క్రమంలోనే అతను తాజాగా హైదరాబాద్‌లో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లాడు. అక్కడ మల్లారెడ్డి ప్రస్తావన తెచ్చి.. ఆయన్ని ఇమిటేట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘మీ పెద్దాయన మల్లారెడ్డి సార్ ఉంటారేమో అనుకుని వచ్చాను. ఆయన స్టైల్ గానీ, స్పీచ్ గానీ అంటే నాకు చాలా ఇష్టం’’ అని చెప్పిన నవీన్.. ఆయన స్టైల్లో తన సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు.
‘‘కష్టపడ్డా.. ఇన్ని హిట్లు ఏడికెళ్లి వచ్చినయ్. ఎట్లచ్చినయ్. నేనేమైనా మాయ జేసినానా.. మంత్రం జేసినానా.. కష్టపడ్డా.. స్కిట్లు రాసినా.. యూట్యూబ్‌లో వీడియో జేసినా.. అనుష్కతో హీరోగా జేసినా.. సక్సెస్ అయినా..’’ అంటూ నవీన్ మల్లారెడ్డి స్టైల్లో డైలాగులు చెబుతుంటే ఆడిటోరియం హోరెత్తిపోయింది. సోషల్ మీడియాలోనూ ఈ వీడియోకు మంచి స్పందన వస్తోంది.
This post was last modified on July 12, 2023 4:52 pm
జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…
ఏపీలో అధికార కూటమి మిత్ర పక్షాల మధ్య వక్ఫ్ బిల్లు వ్యవహారం.. తేలిపోయింది. నిన్న మొన్నటి వరకు దీనిపై నిర్ణయాన్ని…
హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…
టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…
మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు.. తన యాక్టివిటీని తగ్గించారు. ఆయన పార్టీలో ఒకప్పుడు యాక్టివ్…
టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో…