Movie News

ఆర్ఆర్ఆర్ 2 రాజమౌళితో కాదు

ఆస్కార్ వేదిక దాకా వెళ్లి సగర్వంగా టాలీవుడ్ జెండా ఎగరేసిన ఆర్ఆర్ఆర్ కు కొనసాగింపు ఉండదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ రచయిత విజయేంద్ర ప్రసాద్ దానికి సంబంధించిన శుభవార్త చెప్పేశారు. ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రిపులార్ సీక్వెల్ ని హాలీవుడ్ సంస్థకు అప్పజెప్పబోతున్నామని, వేలకోట్ల బడ్జెట్ తో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే దర్శకుడిగా రాజమౌళి ఉండరని, ప్రస్తుత కమిట్ మెంట్ల వల్ల అది సాధ్యపడదని తేల్చేశారు. మరి ఇంగ్లీష్ డైరెక్టర్ చేతిలో పెడతారా లేక  ఇండియన్ చేతికిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంటుంది.

మహేష్ బాబు సినిమా తాలూకు స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్న జక్కన్న షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టేది ఇంకా నిర్ణయించుకోలేదు. గుంటూరు కారం పూర్తయ్యాక, మహేష్ కొంత విశ్రాంతి తీసుకున్నాక డేట్ డిసైడ్ అవుతుంది. అది కూడా ఫైనల్ వెర్షన్ రాజమౌళికి పూర్తిగా సంతృప్తినిచ్చాకే. మరి ఆర్ఆర్ఆర్ 2 బాధ్యతను వేరొకరికి ఇచ్చినప్పుడు ఫస్ట్ పార్ట్ లో పండిన ఎమోషన్, ఎలివేషన్ అంతే స్థాయిలో అతను పండించగలరా అనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఇదంతా చర్చల దశలో ఉన్నట్టు కనిపిస్తోంది. విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అయితే ఇచ్చేసినట్టు ఉన్నారు.

ఇకపై చేయబోయే సినిమాలు వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీయబోతున్న రాజమౌళి తన బ్రాండ్ ని మరింత విస్తరించే పనిలో ఉన్నారు. ప్రాజెక్ట్ కె ఎలాగూ ఇంటర్నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేసుకుని దానికి తగ్గ స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. దాన్ని మించేలా ఎస్ఎస్ఎంబి 29ని రెడీ చేయాల్సి ఉంటుంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఆర్ఆర్ఆర్ 2కి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మళ్ళీ అన్నేసి డేట్లు ఇవ్వడం పెద్ద సవాలే. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చితే మళ్ళీ తమ హీరోల దర్శనం రెండు మూడేళ్లు దూరమవుతుందనే టెన్షన్ అభిమానులకు ఖచ్చితంగా ఉంటుంది 

This post was last modified on July 10, 2023 3:06 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

2 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

2 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

3 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

3 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

4 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

6 hours ago