పఠాన్ లాంటి వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా కావడంతో జవాన్ మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కమర్షియల్ మూవీస్ తో విజయ్ కు బ్యాక్ టు బ్యాక్ హిట్లిచ్చిన అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ట్రైలర్ ని వెరైటీగా ప్రీవ్యూతో పేరుతో రిలీజ్ చేశారు. రెండు నిమిషాల పన్నెండు సెకండ్ల పాటు ఉన్న వీడియోని చాలా జాగ్రత్తగా, కథ ఎక్కువగా అర్ధమయ్యే ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం గ్రాండ్ విజువల్స్ తో నింపేశారు. షారుఖ్ బ్యానర్ స్వంత యూట్యూబ్ ఛానల్ లోనే అన్ని బాషల వెర్షన్లు పెట్టేశారు
డీకోడ్ చేసినంత వరకు స్టోరీ మీద ఒక అండర్ స్టాండింగ్ కు రావొచ్చు. అన్యాయానికి గురైన తల్లికి ఇచ్చిన మాట కోసం జైల్లోనే పుట్టి పెరిగిన ఒక యువకుడు (షారుఖ్ ఖాన్) దానికి కారణమైన వాళ్ళ మీద సమాజం మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధపడతాడు. అందులో భాగంగా ఎన్నో విధ్వంసాలకు పాల్పడి దుర్మార్గులకు పాఠం చెప్పడం మొదలుపెడతాడు. అతన్ని పట్టుకునే లక్ష్యంతో రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్(నయనతార)తో పాటు మరో శత్రువు(విజయ్ సేతుపతి)కి సవాళ్లు ఎదురవుతాయి. ఇంతకీ జవాన్ ఎందుకు ఇదంతా చేశాడనేది తెరమీద చూడాలి
అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఇంకా చెప్పాలంటే అంతకు మించి అనేలా ట్రైలర్ ఉంది. దీపికా పదుకునే స్పెషల్ క్యామియోని రివీల్ చేశారు. విజయ్ బిగిల్ తరహాలో ఇందులో కూడా హీరోకు అండగా ఒక అమ్మాయిల గ్యాంగ్ ని సెట్ చేసిన అట్లీ తన రెగ్యులర్ స్టైల్ లోనే వెళ్ళాడు. కాకపోతే బడ్జెట్ భారీగా ఉండటంతో అవుట్ ఫుట్ హెవీగా కనిపిస్తోంది. అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఎలివేషన్ ఇచ్చింది. ఫ్యాన్స్ కి మాత్రం కనులపండగలా ఉంది. చివర్లో నున్నని గుండుతో కనిపించడం చూస్తే శివాజీలో రజనీకాంత్ స్టైల్ ని ఫాలో అయినట్టు కనిపిస్తోంది
This post was last modified on July 10, 2023 11:41 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…