పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ టైం కాంబినేషన్ లో రూపొందిన బ్రో ఫస్ట్ ఆడియో సింగల్ అభిమానులను సంతృప్తిపరచలేదని సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను చూస్తే అర్థమైపోతోంది. ఓ రేంజ్ లో వైరల్ కావాల్సిన సాంగ్ ఏదో మాములు స్థాయిలో మెల్లగా మిలియన్ల వ్యూస్ దాటడం పట్ల ఫ్యాన్స్ తమ అసహనాన్ని ఓపెన్ గానే బయట పెడుతున్నారు. మై డియర్ మార్కండేయ ట్యూన్ ప్లస్ సాహిత్యం రెండింటి పరంగా పెద్దగా మార్కులు దక్కించుకోలేకపోయింది. కేవలం పవన్ స్టైల్ అండ్ స్వాగ్ మాత్రమే వీడియోని చివరిదాకా చూసేలా చేస్తున్నాయి.
దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తమన్ మీద విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అత్తారింటిది దారేది, గబ్బర్ సింగ్ రేంజ్ లో పేలాల్సిన స్పెషల్ సాంగ్ ఇలా చప్పగా సాగిపోవడం పట్ల నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంలో ఆశ్చర్యం లేదు. దీని దెబ్బకు మహేష్ అభిమానులు కూడా టెన్షన్ పడుతున్నారు. అసలే గుంటూరు కారం మీద రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తమన్ మీదే ఎక్కువ గాసిప్స్ వచ్చాయి. ఒకదశలో తప్పించారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ త్రివిక్రమ్ కున్న నమ్మకం అలా జరగనివ్వకుండా అడ్డుపడింది. అసలు ఆల్బం కంపోజింగ్ మొదలయ్యిందో లేదో తెలియదు
ఇదంతా తమన్ సీరియస్ గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే టాలీవుడ్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నప్పుడు ప్రతి ట్యూన్ బెస్ట్ ఉండాలని మ్యూజిక్ లవర్స్ డిమాండ్ చేస్తారు. వాటిని అందుకోవాల్సిందే. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు ఎలాంటి స్కోర్ ఇచ్చాడోననే ఆందోళన అటు మెగా పవర్ స్టార్ టీమ్ లోనూ ఉంది. అల వైకుంఠపురములో నాటి తమన్ కావాలని అందరి కోరిక. ఒకపక్క అనిరుద్ రవిచందర్ తమిళంలో ఎంత బిజీగా ఉన్నా సరే తెలుగు ప్రాజెక్టులు పడుతున్నాడు. అలాంటప్పుడు కాంపిటీటివ్ స్పిరిట్ తో బెస్ట్ ఇవ్వాలి. బ్రో బ్యాలన్స్ పాటలు విన్నాక ఒక ఫైనల్ కంక్లూజన్ కి రావొచ్చు
This post was last modified on July 10, 2023 9:21 am
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…