టెక్నీషియన్స్ దర్శకులుగా మారి హిట్లు కొట్టడం చాలానే చూశాం. కెమెరా మెన్ , కొరియోగ్రాఫర్ ఆఖరికి మ్యూజిక్ డైరెక్టర్ ఇలా చాలా డిపార్ట్ మెంట్స్ నుండి దర్శకులు వచ్చారు. తాజాగా ఓ ఇద్దరు కుర్ర ఎడిటర్లు కూడా ఈ ప్రయత్నం చేశారు. పూరీ సినిమాలకు ఎడిటర్ గా వర్క్ చేసిన ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి నితిన్ తో ‘మాచర్ల నియోజిక వర్గం’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా మీద నితిన్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మాస్ కంటెంట్, వైరల్ సాంగ్ తో కాసుల వర్షం కూరుస్తుందని అనుకున్నాడు కానీ తీరా చూస్తే సినిమా డిజాస్టర్ అనిపించుకొని రెండో రోజే డ్రాప్ అయింది. దీంతో దర్శకుడిగా రాజశేఖర్ విఫలం అయ్యాడు.
ఇక నిఖిల్ కూడా ఎడిటర్ గ్యారీ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘స్పై’ అనే సినిమా చేశాడు. రిజల్ట్ ఏమైందో తెలిసిందే. గ్యారీ బీ హెచ్ అడివి శేష్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాడు. ఆ అనుభవంతో స్పై అనే పాన్ ఇండియా సినిమా ఆఫర్ అందుకున్నాడు. కానీ డైరెక్షన్ లో తన టాలెంట్ నిరూపించుకోలేకపోయాడు. నిర్మాత అందించిన కథ -కథనం వీక్ ఉండటంతో దర్శకుడిగా మంచి మార్కులు స్కోర్ చేయలేకపోయాడు.
రాజశేఖర్ , గ్యారీ ఇద్దరూ ఎడిటింగ్ లో మంచి మార్క్స్ తెచ్చుకున్నారు కానీ దర్శకులుగా మంచి స్కోర్ చేయలేకపోయారు. వీరిద్దరి వల్ల కుర్ర హీరోలు ఇకపై టెక్నీషియన్స్ ను నమ్మాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఈ ఎడిటర్లు దర్శకులుగా సక్సెస్ అయితే మరి కొందరు టెక్నీషియన్స్ కి ఉత్సాహం వచ్చేది. ఇంకొంత మంది దర్శకులుగా మారి ఉండే వారు.