‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యువ దర్శకుడు అజయ్ భూపతి సెన్సేషన్ క్రియేట్ చేసి రెండేళ్లు దాటిపోయింది. ఆ చిత్ర కథానాయకుడు కార్తికేయ ఐదారు సినిమాలు చేసేశాడు. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా వరుసబెట్టి సినిమాలు చేసేసింది. దీని టెక్నీషియన్లకు కూడా మంచి అవకాశాలే వచ్చాయి.
కానీ దర్శకుడు అజయ్ భూపతి మాత్రం ఇప్పటిదాకా తన రెండో సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు. ముందు పెళ్లితో అతను బిజీ అయ్యాడు. తర్వాత కథ రెడీ చేసుకోవడానికి సమయం పట్టింది. ఆపై ఈ మల్టీప్టారర్ మూవీకి హీరోలను ఎంచుకోవడానికి చాలా కాలం పట్టేసింది. చివరికి శర్వానంద్, సిద్దార్థ్‌లతో ఈ సినిమా తీయడానికి అంగీకారం కుదిరింది.
అంతా ఓకే అనుకునేసరికి కరోనా వచ్చి అన్ని కార్యకలాపాలనూ ఆపేసింది. ‘మహాసముద్రం’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తాజాగా ఓ కథానాయికనూ ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో శర్వానంద్ సరసన ‘సమ్మోహనం’ బ్యూటీ అదితి రావు హైదరి నటించనున్నట్లు సమాచారం. తెలుగులో చేసిన తొలి సినిమాతో సమ్మోహనపరిచిన అదితికి ఆ తర్వాత ఆ స్థాయి అవకాశాలు రాలేదు.
ఈ నేపథ్యంలో ‘మహాసముద్రం’ ఆమెకు మంచి ఛాన్సే అనుకోవాలి. సిద్ధు సరసన కూడా ఓ కథానాయిక ఉంటుందని.. ఆమెను త్వరలోనే ఖరారు చేసి కరోనా జోరు తగ్గాక ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తారని సమాచారం. కాగా అజయ్ భూపతి నిన్ననే కరోనా బారిన పడినట్లు వెల్లడించాడు.
This post was last modified on August 14, 2020 4:46 pm
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…