గత ఏడాది ది కాశ్మీర్ ఫైల్స్ తో ఊహించని బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దానికెంత ప్రాపగాండ సినిమా అని పేరొచ్చినా ఫలితం మాత్రం గొప్పగా తెచ్చుకున్నారు. కాశ్మీర్ పండిట్ల ఊచకోత గురించి ఒకవైపే చెప్పారన్న కామెంట్లు ఎన్ని వచ్చినా ఆడియన్స్ మాత్రం బ్రహ్మాండంగా ఆదరించారు. ప్రస్తుతం ది వ్యాక్సిన్ వార్ తీస్తున్న వివేక్ దీని షూటింగ్ ని చివరి దశకు తీసుకొచ్చారు. వాస్తవానికి విడుదల వచ్చే ఏడాది చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు దాన్ని ప్రీ పోన్ చేసి సెప్టెంబర్ 28 రిలీజ్ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు లేటెస్ట్ అప్డేట్.
సలార్ కి ఎదురెళ్లడానికి పెద్ద హీరోలే భయపడుతుంటే ఈయన మాత్రం తగుదునమ్మా అంటూ రెడీ అయ్యారట. దీని వెనుక కారణం లేకపోలేదు. 2022లో సరిగ్గా రాధే శ్యామ్ వచ్చిన రోజే ది కాశ్మీర్ ఫైల్స్ రిలీజై పెద్ద హిట్టు కొట్టింది. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ నే ఢీ కొడితే రిజల్ట్ రిపీట్ అవుతుందనే నమ్మకం కాబోలు. ది వ్యాక్సిన్ వార్ కథ కరోనా వచ్చిన టైంలో ఇండియా తీసుకున్న చర్యలు, దేశంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితులను ధీటుగా ఎదురుకున్న తీరుని ఆధారంగా చేసుకుని రాసుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే బిజెపి ప్రభుతాన్ని పొగిడేలాగే సినిమా ఉంటుందని బాలీవుడ్ టాక్.
ఏది ఏమైనా వివేక్ అగ్నిహోత్రిది ముమ్మాటికీ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది ముంబై విశ్లేషకుల మాట. ప్రతిసారి ఆడియన్స్ అమాయకంగా మోసపోరని, పైగా కరోనా గాయాలు మర్చిపోయి ఇప్పుడిప్పుడే సాధారణ జీవనానికి అలవాటు పడిన వాళ్లకు మరోసారి ఆ భూతం గురించి చూపిస్తామంటే ఎగబడి టికెట్లు కొనరని హెచ్చరిస్తున్నారు. ఇవి చాలవన్నట్టు వివేక్ అగ్నిహోత్రి కావాలనే సలార్ టీజర్ గురివి నెగటివ్ క్రిటిసిజం చేస్తూ ఏకంగా హీరోయిజం సినిమాలను జనం ఆదరించడం పట్ల ఘాటుగా కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో బూమరాంగ్ అయ్యింది. మరి నిజంగానే క్లాష్ అవుతాడా లేదానేది చూడాలి
This post was last modified on July 7, 2023 5:23 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…