Movie News

బింబిసార-2.. అసలుంటుందా?

గత ఏడాది తెలుగు వచ్చిన బిగ్గెస్ట్ హిట్లలో ‘బింబిసార’ ఒకటి. కొన్నేళ్లుగా సరైన విజయాలు లేని నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందించాడు. కళ్యాణ్ రామ్ మార్కెట్ స్థాయికి మించి బాగా ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా పెట్టుబడి మీద రెట్టింపు కన్నా ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టింది. కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన ‘బింబిసార’కు సీక్వెల్ తీయాలని ఆ సినిమా రిలీజైనపుడే అనుకున్నారు.

ఈ దిశగా పని కూడా మొదలైంది. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఈ చిత్రం నుంచి దర్శకుడు వశిష్ఠ తప్పుకున్నాడు. అతడికి క్రేజీ ఆఫర్లు ఉండటంతో ఈ చిత్రం నుంచి తప్పుకున్నందుకు పెద్దగా ఫీలేమీ అవ్వాల్సిన పని లేకపోయింది. ఐతే కాంట్రాక్ట్ బ్రేక్ చేసి ఈ సినిమా నుంచి తప్పుకున్నందుకు కళ్యాణ్ రామ్ సంస్థకు నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.

అదే సమయంలో తన ఇన్‌పుట్స్, ఐడియాలను సీక్వెల్ కోసం వాడుకుంటే న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని వశిష్ఠ ఫిక్సయినట్లు కూడా గుసగుసలు వినిపించాయి. మొత్తానికి వశిష్ఠ అయితే ఈ ప్రాజెక్టులో లేడని స్పష్టమైపోయింది. కానీ అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అన్న సందేహాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేవలం ‘బింబిసార’ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి మాత్రమే సీక్వెల్ తీయాలని కళ్యాణ్ రామ్ అనుకోవట్లేదు. కొందరు రచయితలు.. అలాగే తన ప్రొడక్షన్ టీం కలిసి ఈ సినిమాకు స్క్రిప్టు రెడీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

అలాగే తన వీఎఫెక్స్ కంపెనీ ఈ సినిమాకు కావాల్సిన సహకారం అంతా అందిస్తుంది. ‘బింబిసార’ సక్సెస్‌లో ఆ కంపెనీ పాత్ర కూడా కీలకమే. వీళ్లంతా కలిసి ఒక సంతృప్తికరమైన స్క్రిప్టు రెడీ చేసి.. దాన్ని సమర్థంగా తెరకెక్కించగల దర్శకుడు దొరికితేనే ఈ ప్రాజెక్టు ఉంటుందట. ఐతే ఇప్పటిదాకా జరిగిన వర్క్ పట్ల అయితే పూర్తి సంతృప్తి లేదని తెలుస్తోంది. అందుకే ముందు అనుకున్నట్లు బుధవారం కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేయలేదు. కాబట్టి ‘బింబిసార’ సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని చెప్పలేని పరిస్థితి.

This post was last modified on July 7, 2023 11:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

2 hours ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

2 hours ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

3 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

3 hours ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

4 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

4 hours ago