మంచు ఫ్యామిలీ నుంచి కొంచెం లేటుగా నటనలోకి అడుగు పెట్టింది లక్ష్మీ ప్రసన్న. ఆమె రచ్చ గెలిచి ఇంటికి రావడం విశేషం. టాలీవుడ్లో సినిమాలు చేయడానికి ముందే.. ఆమె అమెరికాలో నట శిక్షణ తీసుకుని హాలీవుడ్లో నటించింది. ఒక సినిమా, ఒక టీవీ సిరీస్, ఒక షార్ట్ ఫిలింలోనూ నటించింది. లక్ష్మి టాలీవుడ్ అరంగేట్రానికి ముందే సంబంధిత సన్నివేశాలు కొన్ని యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి.
ఐతే తెలుగులో చేసిన తొలి సినిమా ‘అనగనగా ఒక ధీరుడు’తోనే నంది అవార్డు అందుకున్న మంచు లక్ష్మి.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ‘గుండెల్లో గోదారి’ సహా ఆమె చేసిన సినిమాలన్నీ నిరాశ పరిచాయి. ఇప్పుడు ఆమె కెరీర్ బాగా స్లో అయిపోయింది. తండ్రితో కలిసి ఏదో ఒక సినిమా చేస్తున్నప్పటికీ దానికి అంతగా క్రేజ్ లేదు. ఐతే తాను హాలీవుడ్లో ఉంటే కథ వేరుగా ఉండేది అంటోంది లక్ష్మి.
తన హాలీవుడ్ కెరీర్ మధ్యలో ఆగిపోవడంపై ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. హాలీవుడ్లో ఉంటే మీ కెరీర్ మరోలా ఉండేదేమో కదా అని ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు మంచు లక్ష్మి బదులిస్తూ.. ‘‘నేను హాలీవుడ్లో ఒక సిరీస్, సినిమా చేసి వదిలేయలేదు. నేను హాలీవుడ్ యాక్టర్‌ని. నా దురదృష్టం కొద్దీ అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చా.
ఈ పదేళ్లు అక్కడ ఉండుంటే నేను ఎక్కడో ఉండేదాన్ని. పాప కావాలి అనుకున్నపుడు ఇండియాకు వచ్చేయాలని డిసైడయ్యా. పిల్లల విషయంలో ఇక్కడున్న కంఫర్ట్, కేరింగ్ ఇంకెక్కడా ఉండదు. ఇప్పుడు పాపకు రెక్కలొచ్చాయి. మాక్కూడా రెక్కలొచ్చాయి. అందుకే వేరే అవకాశాల కోసం చూస్తున్నాం. మళ్లీ విదేశాలకు వెళ్లే అవకాశం వస్తే ఒక్క క్షణం ఆలోచించకుండా ఫ్లైట్ ఎక్కేశా’’ అని తెలిపింది.
This post was last modified on July 7, 2023 9:44 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…