ఆన్ లైన్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న సలార్ లో హీరో ప్రభాస్, విలన్ పృథ్విరాజ్ సుకుమారన్ కంటే ఎక్కువ హైలైట్ అయ్యింది సగం వీడియోకు పైగా కనిపించే నటుడు టిను ఆనంద్. కెజిఎఫ్ రెండు భాగాల్లో రాఖీ భాయ్ క్యారెక్టర్ కు ఎలివేషన్ ఇచ్చేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ సీనియర్లు అనంత్ నాగ్, ప్రకాష్ రాజ్ లను ఎలాగైతే వాడుకున్నాడో ఇప్పుడీ లెజెండరీ యాక్టర్ ని కూడా సరిగ్గా ఆ ఉద్దేశంతోనే తెచ్చుకున్నాడు. ఈయన వయసు 77 సంవత్సరాలు. ఆషామాషీ వ్యక్తి కాదండోయ్. ఇప్పటి తరానికి అంతగా అవగాహన లేకపోవచ్చు కానీ ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలుసుకుంటే ఎందుకు ఎంచుకున్నారో అర్థమవుతుంది.
టిను ఆనంద్ చాలా తక్కువగా తెలుగు, తమిళ సినిమాల్లో కనిపించినా గుర్తుండిపోయే పాత్రలు చేశారు. బాలకృష్ణ ఆదిత్య 369లో ప్రొఫెసర్ గా, చిరంజీవి అంజిలో వజ్రం కోసం పరితపించే కోటీశ్వరుడిగా ఆయన పెర్ఫార్మన్స్ ని మర్చిపోలేం. ప్రభాస్ సాహో, దుల్కర్ సల్మాన్ సీతా రామంలోనూ తళుక్కున మెరిశారు. అయితే ఇవన్నీ టిను ఆనంద్ గొప్పదనం కాదు. ఆయన మంచి రచయిత కం దర్శకులు కూడా. అమితాబ్ బచ్చన్ కు కాలియా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. తర్వాత బిగ్ బితోనే షెహేంషా, మై ఆజాద్ హూ, మేజర్ సాబ్ రూపొందించారు. అన్నీ కమర్షియల్ హిట్లే.
చివరిగా డైరెక్ట్ చేసింది 2003లో ఏక్ హిందూస్థానీ. సునీల్ శెట్టి, రవీనాటాండన్ జంటగా రూపొందిన ఈ దేశభక్తి చిత్రం విడుదల కాలేదు. నటుడిగా, రైటర్ గా ఎన్నో సూపర్ హిట్స్ లో భాగం పంచుకున్నారు. ఫిల్మోగ్రఫీలో మరపురాని పాత్రలు దక్కించుకున్నారు. ఇంత లేట్ వయసులోనూ ఏదైనా అవకాశం వస్తే కాదనకుండా చేస్తారు. ఇప్పుడీ సలార్ టీజర్ లో అంత పవర్ ఫుల్ డైలాగుని గొంతు వణక్కుండా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేలా చెప్పడం టిను ఆనంద్ కే చెల్లింది. ఒకటి రెండు తప్ప సౌత్ లో అన్నీ సక్సెస్ ఫుల్ మూవీస్ లోనే నటించిన పెద్దాయనకు సలార్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.
This post was last modified on July 7, 2023 7:46 am
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా కబురు వచ్చేసింది. కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నట్లే విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…
ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్ విధించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ మంత్రివర్గం..…