రెండు వారాల క్రితం కోలీవుడ్ లో విడుదలై మంచి విజయం అందుకున్న మామన్నన్ తెలుగులో నాయకుడుగా తీసుకురాబోతున్నారు. హీరో ఉదయనిధి స్టాలిన్ కి ఇప్పటిదాకా మన దగ్గర మార్కెట్ లేదు. అప్పుడెప్పుడో ఓకే ఓకే అనే డబ్బింగ్ మూవీ ఓ మోస్తరుగా ఆడటం తప్పించి ఏపీ తెలంగాణ జనాలకు తన గురించి తెలిసింది తక్కువే. నెట్ ఫ్లిక్స్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాడు. అరవంలో హీరోగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ప్రజా ప్రతినిధిగా, సిఎం స్టాలిన్ కొడుకుగా ఇతని నెట్ వర్క్ చిన్నది కాదు. మామన్నన్ తో నటనకు స్వస్తి చెబుతానని ఇంతకు ముందే ప్రకటించాడు.
అక్కడ ఎంత బాగా ఆడినా మామన్నన్ ని మనవాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఎందుకంటే ఇది చాలా సీరియస్ సబ్జెక్టుతో రూపొందింది. అగ్ర వర్ణాలు, వెనుకబడిన కులాల మధ్య ఆధిపత్య పోరాటాన్ని రాజకీయాలకు ముడిపెట్టి తీశాడు దర్శకుడు మారి సెల్వరాజ్. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి పిలిచి మరీ మెచ్చుకున్నారంటే ఏ రేంజ్ లో ఎక్కిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కేవలం కమెడియన్ గానే మనకు పరిచయమున్న వడివేలులోని సీరియస్ యాంగిల్ ఈ నాయకుడులో అద్భుతంగా ఆవిష్కరించారు. అది మనకు సర్ప్రైజ్ గానే ఉండబోతోంది.
ఇవి కాకుండా పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్, హీరోయిన్ కీర్తి సురేష్ క్యాస్టింగ్ లో ఆకర్షణగా నిలుస్తున్నారు. వీటికి తోడు ఏఆర్ రెహమాన్ సంగీతం మరో అట్రాక్షన్. అన్నీ పుష్కలంగా ఉన్న నాయకుడు మరీ ఎక్స్ ట్రాడినరని చెప్పలేం కానీ కాంతార టైపులో ఏదైనా మేజిక్ జరగకపోదాని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఒరిజినల్ నిర్మించిన రెడ్ జాయింట్ ఫిలిమ్స్ తో పాటు సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమా కలిసి సంయుక్తంగా నాయకుడిని పంపిణి చేయబోతున్నారు. జూలై 14న బేబీ, శివకార్తికేయన్ మహావీరుడుతో పోటీ పడబోతున్న నాయకుడు ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి
This post was last modified on July 6, 2023 3:41 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్‌లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…