Movie News

రాక్షస రాజు అంత రిస్కు చేస్తాడా

దర్శకుడు తేజ్ ఎంత బ్యాడ్ ఫామ్ లో ఉన్నారో ఇటీవలే వచ్చిన అహింస మరోసారి ఋజువు చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు నువ్వు నేను, చిత్రం, జయం లాంటి బ్లాక్ బస్టర్స్ ని కొత్త హీరోలకు ఇచ్చిన ఈ వెటరన్ డైరెక్టర్ తన మేజిక్ టచ్ ని కోల్పోవడం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో తీసిన సీత గురించి మళ్ళీ గుర్తు చేయాల్సిన పని లేదు. అయినా సరే సురేష్ సంస్థకు ఆయనంటే తగని నమ్మకం. కారణం నేనే రాజు నేనే మంత్రి సక్సెస్. అదేమీ భీభత్సమైన రికార్డులు సృష్టించకపోయినా రానా వరకు సోలో హీరోగా మంచి హిట్టునే ఇచ్చింది.

ఇప్పుడు ఈ కాంబోలో రాక్షస రాజు రాబోతోంది. తేజ స్వయంగా ఈ విషయాన్ని చెప్పడం చూశాం. అయితే ఇదో పొలిటికల్ థ్రిల్లర్. గాడ్ ఫాదర్ తరహా షేడ్స్ ఉంటూనే బోలెడు ట్విస్టులతో పాటు వర్తమాన రాజకీయాల గురించి చాలా వివాదాస్పద అంశాలు ఉంటాయని తెలిసింది. అయితే దీన్ని రెండు భాగాలుగా తీసే ప్లాన్ లో తేజ ఉన్నట్టు లేటెస్ట్ అప్డేట్. కథ మీద ఎంత నమ్మకం ఉన్నా సరే ఇది ఒక రకంగా రిస్కే. ఒకవేళ మొదటి భాగం ఏదైనా తేడా కొడితే సెకండ్ పార్ట్ ని బయ్యర్లకు నష్టాలు పూడ్చుకోవడానికి అమ్మాలి తప్పించి ఇంకెలాంటి ప్రయోజనం కలగదు.

కెజిఎఫ్, బాహుబలి రేంజ్ లో సక్సెస్ అయితేనే రాక్షస రాజుకి సీక్వెల్ ఐడియా వర్కౌట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇది చర్చల దశలోనే ఉందట. నిర్ణయం తీసుకునే ముందు సురేష్ బాబుతో చర్చించి స్క్రిప్ట్ ని లాక్ చేస్తారు. కంబ్యాక్ కోసం కష్టపడుతున్న తేజకు మళ్ళీ రాక్షస రాజులాంటి పెద్ద ఛాన్స్ రాకపోవచ్చు. దీంతోనే ఋజువు చేసుకోవాలి. రానా కూడా బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆగస్ట్ లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోపీచంద్ తో ప్లాన్ చేసుకున్న మరో ప్రాజెక్టు పెండింగ్ లో ఉంది. రాక్షస రాజు ప్రోగ్రెస్ ని బట్టి అది ఉన్నది లేనిది తేలబోతోంది. 

This post was last modified on July 5, 2023 7:50 pm

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

2 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

7 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

8 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

8 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

8 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

10 hours ago