Movie News

టాలెంట్ ఉంది.. మార్కెట్ లేదు.. పెద్ద సాహసమే

టాలీవుడ్లో నాని తర్వాత అంతే టాలెంటుతో కష్టపడి పైకి వచ్చే ప్రయత్నం చేస్తున్న నటుడు సత్యదేవ్. ఐతే నానికి కలిసొచ్చినట్లు ఈ యువ నటుడికి కలిసి రావడం లేదు. నటుడిగా తన టాలెంట్ ఏంటో చాలా సినిమాల్లో చూపించాడు. కానీ సోలో హీరోగా చేసిన సినిమాలేవీ అతడికి ఆశించిన ఫలితాలివ్వలేదు. బ్లఫ్ మాస్టర్, గాడ్సే లాంటి సినిమాలు సత్యదేవ్‌కు బ్రేక్ ఇచ్చేలా కనిపించాయి కానీ.. చివరికి అవి కూడా నిరాశనే మిగిల్చాయి.

వాటిలో సత్యదేవ్ పెర్ఫామెన్స్ మాత్రం అదిరిందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. తన టాలెంటుకు తగ్గ మంచి సినిమా పడితే కెరీర్ మారుతుందని ఆశిస్తున్నాడు. కానీ చివరి సినిమా ‘గుర్తుందా శీతాకాలం’ సైతం వాషౌట్ అయిపోవడంతో సత్యదేవ్ మార్కెట్ ఇంకా కిందికి వెళ్లిపోయింది. కానీ తన టాలెంటుతో సత్యదేవ్‌ అవకాశాలైతే సంపాదిస్తూనే ఉన్నాడు.

కృష్ణమ్మ, ఫుల్ బాటిల్, జీబ్రా లాంటి వెరైటీ సినిమాలున్నాయి సత్యదేవ్ చేతుల్లో. ఇప్పుడు అతను హీరోగా కొత్త సినిమా అనౌన్స్ చేశారు. అదే.. గరుడ. కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2 చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రమిది. క్రాంతి బాల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘గరుడ’ అనే టైటిల్ చూస్తేనే పెద్ద కాన్వాస్ ఉన్న సినిమాలా అనిపిస్తుంది.

అందుకు తగ్గట్లే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిచ్‌గానే డిజైన్ చేశారు. ఒక పాపను వీపుపై మోస్తూ.. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో మంట పెట్టిన కర్ర పట్టుకుని ఒక పెద్ద సాహసానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నాడు సత్యదేవ్. తన లుక్ బాగుంది. పోస్టర్ చూస్తే కన్నడ స్టార్ సుదీప్ చేసిన ‘విక్రాంత్ రోణ’ గుర్తుకు వస్తోంది. సినిమా అయితే మంచి బడ్జెట్లో, పెద్ద కాన్వాస్‌లో తెరకెక్కుతున్నట్లే కనిపిస్తోంది. పైగా ‘చాప్టర్-1’ అని పెట్టారంటే ఫ్రాంఛైజీ సినిమాలా చేసే అవకాశం ఉంది. సత్యదేవ్‌కు పెద్దగా మార్కెట్ లేకున్నా.. తన టాలెంటుని నమ్మి ఇలాంటి పెద్ద సినిమా తీస్తున్న అభిషేక్ అభినందనీయుడే.

This post was last modified on July 5, 2023 3:20 pm

Share

Recent Posts

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

35 minutes ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

2 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

3 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

4 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

5 hours ago

వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…

5 hours ago