పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ క్రేజీ కాంబోలో రూపొందుతున్న బ్రో బిజినెస్ ఊపందుకుంది. ట్రేడ్ న్యూస్ ప్రకారం వంద కోట్లకు పైగానే థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ఇన్ సైడ్ టాక్. ఏరియాల వారిగా నిర్మాతలు అడిగిన మొత్తం ఎంత భారీగా ఉన్నా డిస్ట్రిబ్యూటర్లు వెనుకడుగు వేయలేదని తెలిసింది. వేసవి మొత్తం కేవలం రెండు మూడు హిట్లతోనే గడిచిపోవడం, ఏడాది పైగా గ్యాప్ తో వస్తున్న పవర్ స్టార్ మూవీ కావడం లాంటి కారణాల వల్ల బయ్యర్లు ఎగబడి కొంటున్నారని సమాచారం. పైగా జనసేన కార్యకలాపాలు మంచి వేగమందుకుంటున్న టైంలో బ్రో వస్తోంది.
మరి ఇంతేసి పెట్టి హక్కులు కొన్నప్పుడు సహజంగానే రెగ్యులర్ టికెట్ రేట్లతో వెళ్ళలేరు. తెలంగాణలో ఎలాగూ మల్టీప్లెక్సులకు 295 రూపాయలు ప్లస్ ఎక్స్ ట్రా షోకు అనుమతి ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటొచ్చి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితే అంత అనుకూలంగా ఉండదు. పవన్ వదులుతున్న విమర్శల బాణాలకు అధికారిక వైసిపి పార్టీ కిందా మీద అవుతోంది. ఏకంగా ముఖ్యమంత్రే పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసే దాకా వచ్చింది. ఇంత వేడిలో బ్రో రిలీజవుతోంది కాబట్టి సహజంగానే దాని మీద కన్ను పడుతుంది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ పరిణామాలు గుర్తున్నాయిగా.
గత ఏడాది కాలంలో ఏపిలో టికెట్ హైకులు, బెనిఫిట్ షోలకు సంబంధించి అన్ని పెద్ద సినిమాలకు పర్మిషన్లు ఇచ్చారు. అయితే బ్రో భారీ బడ్జెట్ కాదు. పైగా రీమేక్. సేఫ్ బడ్జెట్ లోనే అయిపోయింది. అలాంటప్పుడు నిర్మాతలు అనుమతులు కోరతారా అంటే అనుమానమే. ఒకవేళ అడిగినా ఇస్తారా లేదానేది ఆసక్తికరంగా మారింది. ఇస్తే సమస్య ఇవ్వకపోతే తలనొప్పి అన్నట్టు ఉంది వైసిపి పరిస్థితి. ఒకవేళ ఈ గొడవంతా ఎందుకనుకుంటే పాత రేట్లతోనే ఏపీలో టికెట్ల అమ్మకాలు చేసుకోవచ్చు. జూలై 28 విడుదలకు రెండు మూడు రోజుల వరకు ఈ సీన్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఏమైనా అనూహ్య నిర్ణయాలు ఉంటే తప్ప.
This post was last modified on July 5, 2023 3:20 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…