Movie News

సమంతా విశ్రాంతి సరే మరి ప్రమోషన్లు?

శాకుంతలం డిజాస్టర్ దెబ్బకు అది విడుదలైన మూడో రోజే సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళిపోయిన సమంతా కొద్దిరోజుల క్రితమే ఇండియా వచ్చి బాలన్స్ ఉన్న ఖుషికి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొంటోంది. ఇంకో వారంలోపే మొత్తం పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేస్తారు. ఇదయ్యాక సామ్ ఓ ఏడాది పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోబోతోందనే వార్త ఫ్యాన్స్ మధ్య వైరల్ గా మారింది. గతంలో అనారోగ్యం బారిన పడినప్పుడు దానికి సంబంధించిన చికిత్స ఇంకొంత ఉందట. అందులో భాగంగానే డాక్టర్లు రెస్టు తీసుకోమని చెప్పారని ఇన్ సైడ్ టాక్.

సమంత ఇది అఫీషియల్ గా చెప్పలేదు కానీ నిప్పు లేనిదే పొగరాదు కాబట్టి నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఖుషి సెప్టెంబర్ 1 విడుదల కానుంది. కనీసం నెల రోజుల పాటు ప్రమోషన్లు చేయాల్సి ఉంటుంది. సామ్ అందుబాటులో ఉండటం చాలా అవసరం. విజయ్ దేవరకొండ ఎంత తిరిగినా మెయిన్ హీరోయిన్ పబ్లిసిటీలో భాగం కావాల్సిందే. అయితే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. శాకుంతలం ఈవెంట్లకు ప్రెస్ మీట్లకు వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడ్డ సామ్ అదంతా కేవలం సానుభూతి కోసమేననే ట్రోల్స్ ని సోషల్ మీడియాలో ఫేస్ చేయాల్సి వచ్చింది.

కావాలని చేయకపోయినా దీని మీద ట్విట్టర్ లో పెద్ద రచ్చే జరిగింది. కథ ఇక్కడితో అయిపోలేదు. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ స్ట్రీమింగ్ ని అమెజాన్ ప్రైమ్ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ప్లాన్ చేస్తోంది. దానికి భారీ ఎత్తున ప్రమోషన్లు సిద్ధం చేయబోతున్నారు. ఇప్పటిదాకా ఏ వెబ్ సిరీస్ కి జరగనంత హంగామా దీనికి ఉంటుందని ఓటిటి వర్గాల కథనం. అందులో భాగంగా సమంతా యాక్టివ్ గా పాల్గొనాల్సి ఉంటుంది. సో 2023 గడిచాక వచ్చే సంవత్సరం రిలాక్స్ అవ్వొచ్చు. అన్నట్టు కొత్త కమిట్ మెంట్ల కోసం తీసుకున్న అడ్వాన్సులను సమంతా వెనక్కు ఇచ్చినట్టు వినికిడి 

This post was last modified on July 5, 2023 12:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

37 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

44 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago