లాక్‍డౌన్‍కి ముందు మే నెలలో వకీల్ సాబ్ రిలీజ్ చేయాలనే లక్ష్యంతో యమ వేగంగా షూటింగ్ జరిపిన బృందానికి అయిదు నెలలుగా విరామం వచ్చేసింది. మళ్లీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. పవన్‍కళ్యాణ్ అయితే ఇప్పట్లో సెట్స్కి వెళ్లే మూడ్‍లో లేడు. అయితే పవన్‍కళ్యాణ్ పుట్టినరోజు వస్తోంది కనుక, ఆ రోజున అభిమానులు వకీల్‍సాబ్ టీజర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కనుక టీజర్ కట్ చేసే పనిలో వకీల్‍సాబ్ టీమ్ నిమగ్నమయింది.
పవన్‍కళ్యాణ్ గత చిత్రం అజ్ఞాతవాసి రెండేళ్లు దాటిపోవడంతో ఈ టీజర్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అవడానికి ఇది పింక్ అనే సీరియస్ సినిమాకి రీమేక్ అయినా కానీ పవన్‍కళ్యాణ్ స్టయిల్, స్వాగ్ తగ్గకుండా అతని క్యారెక్టర్‍ని సూపర్‍హీరోలానే చూపిస్తున్నారట. కాబట్టి టీజర్‍లో ఫాన్స్ పండగ చేసుకునే షాట్స్ చాలానే వుంటాయన్నమాట. ఈ టీజర్‍ని సినిమాకి టీజర్‍లా కాకుండా బర్త్డే టీజర్‍లానే సిద్ధం చేస్తున్నార్ట. షూటింగ్ పూర్తి చేసుకునే సమయానికి ఎక్స్పెక్టేషన్స్ సరిగ్గా బిల్డ్ చేసే టీజర్ వదుల్తారట. సెప్టెంబర్ 2న పవన్‍కళ్యాణ్ స్టయిల్‍ని మరోసారి వీక్షించే అవకాశం అభిమానులకు దక్కనుంది.
This post was last modified on August 14, 2020 4:46 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…