నందమూరి బాలకృష్ణ ఈ మధ్య మంచి ఊపులోనే ఉన్నారు. అఖండ బ్లాక్ బస్టర్ కావడం, వీరసింహారెడ్డి కూడా హిట్ అవడం.. ‘భగవంత్ కేసరి’కి కూడా మంచి హైప్ ఉండటంతో నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. ఇక బాలయ్య కొత్త సినిమా కూడా అనౌన్స్‌మెంట్‌తోనే అందరి దృష్టినీ ఆకర్షించింది.
‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ కొట్టిన బాబీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ అందరిలోనూ క్యూరియాసిటీ పెంచింది. ‘‘అతను ప్రపంచానికి తెలుసు.. కానీ తన ప్రపంచం ఎవరికీ తెలియదు’’ అంటూ ఈ సినిమాకు పెట్టి క్యాప్షన్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘భగవంత్ కేసరి’ని పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా కథ గురించి ఆసక్తికర ప్రచారం నడుస్తోంది.
ఈ చిత్రంలో బాలయ్య 70వ ఏళ్ల వయసున్న వ్యక్తిగా కనిపించనున్నాడట. ఐతే ఆ పాత్ర సినిమా మొత్తం ఉండదట. కథ మధ్యలో ఆ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందట. ఆ తర్వాత మాత్రం ఆ పాత్ర మీదే ప్రధానంగా కథ నడుస్తుందట. ఈ పాత్ర కోసం బాలయ్య వెరైటీ గెటప్‌లో కనిపించనున్నట్లు సమాచారం. మొదట యంగ్ బాలయ్య పాత్రతో కథ మొదలవుతుందని తెలుస్తోంది.
ఐతే ఈ ఫార్మాట్ అయితే బాలయ్యకు కొత్త కాదు. ‘సింహా’తో మొదలుపెడితే.. లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి.. ఇలా చాలా సినిమాల్లో బాలయ్య ఈ టైపు కథలు చేశాడు. కథ మధ్యలో ఎంట్రీ ఇచ్చే పాత్రను పవర్ ఫుల్‌గా తీర్చిదిద్దుకోవడం.. అందులో బాలయ్య నడి వయస్కుడిగా కనిపించడం చాలా మామూలు అయిపోయింది. ఐతే మొనాటనీ సంగతి పక్కన పెడితే ఈ ఫార్మాట్లోనే బాలయ్య మళ్లీ మళ్లీ హిట్లు కొడుతుండటంతో దర్శకులు కూడా దాన్నే హిట్ ఫార్ములాగా భావించి ఫాలో అయిపోతున్నారు.
This post was last modified on July 3, 2023 4:28 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…