శ్రీవిష్ణు సామజవరగమన స్లోగా మొదలైనా క్రమంగా స్పీడ్ పెంచేసింది. మొదటి రోజు స్పై మీద ఉన్న బజ్ వల్ల ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోయిన ఈ ఎంటర్ టైనర్ అనూహ్యంగా రెండో మూడో రోజు నుంచి ఊపందుకుంది. ముఖ్యంగా ఆదివారం బుకింగ్స్ రచ్చ అనిపించేలా ఉన్నాయి. ఈ హీట్ తగ్గకుండా ఉండటం కోసం హీరో హీరోయిన్ తో సహా టీమ్ మొత్తం విజయ యాత్రలు మొదలుపెట్టి తెలంగాణ నుంచి కర్నూలు దాకా ఒక రౌండ్ వేసేసింది. ఇంకో వారం రోజుల పాటు ఇవి కొనసాగించేలా ప్లాన్ చేసుకున్నారు. వీక్ డేస్ డ్రాప్ రాకుండా ఉండాలంటే ఇవి అవసరమే.
ముఖ్యంగా మీడియా రివ్యూలతో పాటు ట్విట్టర్, ఇన్స్ టా, ఫేస్ బుక్ లో యాక్టివ్ గా ఉండే యుజర్లు సినిమా చూసి చాలా పాజిటివ్ గా రెస్పాండ్ కావడం ఫ్యామిలీ ఆడియన్స్ ని కదిలిస్తోంది. నిజానికి ఫస్ట్ డే ఈవెనింగ్ షో దాకా ఏమంత కదలిక కనిపించలేదు. స్పైకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల ఒకేరోజు రెండు చూడలేని పరిస్థితిలో ఉన్న ఆడియన్స్ ని సామజవరగమన మిస్ చేసుకుంది. వాళ్లంతా వీకెండ్ కు వచ్చేశారు. బ్రేక్ ఈవెన్ గా పెట్టుకున్న మూడున్నర కోట్లను శనివారానికే అందుకోవడంతో సండే నుంచి వచ్చేవన్నీ బయ్యర్లకు లాభాలుగా మారబోతున్నాయి.
వచ్చే శుక్రవారం కొత్త రిలీజులు ఎక్కువగా ఉన్నప్పటికీ సామజవరగమనకు ఇంకో వారం పాటు ఢోకా లేనట్టే కనిపిస్తోంది. హిందీ చిత్రం సత్యప్రేమ్ కి కహానికి మంచి టాకే ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల పరంగా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ డయల్ అఫ్ ది డెస్టినీకి సోసో రెస్పాన్స్ రావడం ప్లస్ అయ్యింది. రేసులో ఉన్న నారాయణ అండ్ కో, మాయా పేటిక, గండలు మినిమమ్ బజ్ తో పాటు ఓ మోస్తరుగా ఉన్నట్టు కూడా టాక్ రాకపోవడంతో సామజవరగమనకు మరింత అనుకూలంగా మారింది. శ్రీవిష్ణు హ్యాట్రిక్ ఫ్లాపులకు చెక్ పడిపోయింది
This post was last modified on July 3, 2023 7:21 am
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…