Movie News

తమన్నా కష్టం బూడిదపాలు

దాదాపు 20 ఏళ్ల కెరీర్ తమన్నాది. టీనేజీలోనే హీరోయిన్ అయిపోయిన ఆమెకు.. తెలుగులో ‘శ్రీ’ సినిమా చేసే సమయానికి కేవలం పదహారేళ్లు మాత్రమే. మొదట్లో చిన్న సినిమాలే చేసిన ఆమె.. తర్వాత పెద్ద రేంజికి వెళ్లిపోయింది. దక్షిణాదిన బిగ్గెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. ఇక్కడ టాప్ స్టార్లు చాలామందితో సినిమాలు చేసింది.

కెరీర్లో చాలా వరకు గ్లామర్ రోల్సే చేసినప్పటికీ.. ఆమె హద్దులు దాటి అందాల ఆరబోత చేసింది లేదు. ఇంటిమేట్ సీన్ల జోలికి వెళ్లలేదు. చివరికి లిప్ లాక్ సీన్ కూడా చేయలేదు మిల్కీ బ్యూటీ. ఈ విషయంలో తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకుని సాగిపోయిందామె. అలాంటిది కెరీర్ చరమాంకంలో తమన్నా ఈ రూల్స్ అన్నీ బ్రేక్ చేసేసింది. కొన్ని వారాల వ్యవధిలో రిలీజైన రెండు వెబ్ సిరీస్‌ల్లో కోసం తమన్నా మామూలుగా రెచ్చిపోలేదు. అందులో ఒకటి ‘జీ కర్దా’ కాగా.. ఇంకోటి ‘లస్ట్ స్టోరీస్-2’.

అమేజాన్ ప్రైమ్ కోసం చేసిన ‘జీ కర్దా’లో ఇద్దరు జూనియర్ కుర్రాళ్లతో ఆమె రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. తమన్నాను అసలు ఊహించుకోలేని సన్నివేశాల్లో ఆమె కనిపించింది. అందులోని బోల్డ్ డైలాగ్స్ సైతం పెద్ద చర్చకే దారి తీశాయి. ఐతే ‘జీ కర్దా’ను కుర్రకారు కేవలం తమన్నా హాట్ సీన్ల కోసమే చూశారు తప్ప.. ఇందులో మరేదీ ఆకర్షించలేదు. కథాకథనాలు పేలవంగా ఉండటంతో మొత్తం సిరీస్ చూడటం శిరోభారంగా మారింది.

దీంతో తమన్నా హాట్ సీన్లు ఉన్న టైమింగ్‌ నోట్ చేసి.. ఆ సమాచారాన్ని సోషల్ మీడియాలో కుర్రాళ్లు షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ‘లస్ట్ స్టోరీస్’ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఇందులోనూ తమన్నా హాట్ సీన్లే హైలైట్ అయ్యాయి. ఇందులో తమ్మూ మరింత బోల్డ్‌గా నటించింది. తన నిజ జీవిత బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తున్న విజయ్ వర్మతో తమ్మూ రెచ్చిపోయి హాట్ సీన్లు చేసింది. క్లీవేజ్ షోలతో రెచ్చిపోయింది. కానీ ‘లస్ట్ స్టోరీస్’ మాత్రం చాలా బ్యాడ్ రివ్యూలు తెచ్చుకుంది. దీన్నొక చెత్త సిరీస్‌గా పేర్కొంటున్నారు. ‘లస్ట్ స్టోరీస్-1’లో ఉన్న క్లాస్ ఇందులో కనిపించలేదు. చివరగా చూస్తే తమన్నా ఇలాంటి సిరీస్‌ల కోసమా ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన ఇమేజ్‌ను దెబ్బ తీసుకుని ఇంత రెచ్చిపోయి నటించింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

This post was last modified on July 1, 2023 5:14 pm

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

7 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

9 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

10 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

10 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

10 hours ago