Movie News

చంద్రముఖి-2.. ఇది ఆడే సినిమానేనా?

సౌత్ ఇండియన్ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి ‘చంద్రముఖి’. ఒక టైంలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ చిత్రంతోనే బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యారు. దక్షిణాదిన హార్రర్ కామెడీ ట్రెండు ఊపందుకుని ఒక పదేళ్లు ఆ జానర్ సినిమాలు పెద్ద ఎత్తున తెరకెక్కడానికి బాటలు పరిచింది ‘చంద్రముఖి’నే.

తమిళంలోనే కాక తెలుగులోనూ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. 90వ దశకంలో మలయాళంలో వచ్చిన ‘మణిచిత్ర తాలు’కి ఇది రీమేక్. తమిళంలో ఈ చిత్రాన్ని రూపొందించిన పి.వాసునే కన్నడలో కూడా రీమేక్ చేసి అక్కడా ఘనవిజయాన్నందుకున్నాడు. కానీ దీనికి కొనసాగింపుగా తీసి హిట్ కన్నడలో ‘ఆప్తమిత్ర-2’ తీసి హిట్ కొట్టిన వాసు.. తెలుగులో దాన్ని ‘నాగవల్లి’ పేరుతో రీమేక్ చేసి దారుణమైన ఫలితాన్ని అందుకున్నాడు. ‘చంద్రముఖి’నే వెంకీని హీరోగా పెట్టి తీసినట్లు అనిపించిన ఆ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు తిరస్కరించారు.

‘నాగవల్లి’ వచ్చి 14 ఏళ్లు అవుతోంది. ఆ టైంలోనే అది ఔట్ డేటెడ్ సినిమాలా కనిపించింది. అలాంటిది ఇప్పుడు పి.వాసు ‘చంద్రముఖి-2’ అంటూ రాబోతున్నాడు. వాసు ఔట్ డేటెడ్ డైరెక్టర్ల లిస్టులో చేరి చాలా ఏళ్లయింది. అలాంటి దర్శకుడు ఇప్పుడు లారెన్స్ హీరోగా ‘చంద్రముఖి-2’ తీశాడు. అసలు ఆల్రెడీ కన్నడ, తెలుగు భాషల్లో సీక్వెల్ వచ్చాక ఇప్పుడు మళ్లీ తమిళంలో కొత్తగా సీక్వెల్ చేయడం ఏంటో అర్థం కావడం లేదు.

హార్రర్ కామెడీ సినిమాలు జనాలక మొహం మొత్తేసి చాలా ఏళ్ల కిందటే వాటిని లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ జానర్లో సినిమాలే ఆగిపోయాయి. లారెన్స్ సైతం ఈ జానర్ సినిమాలతో మొనాటనీ తెప్పించేశాడు. హార్రర్ కామెడీల్లో అతడి ఓవరాక్షన్‌ను ప్రేక్షకులు తట్టుకునే పరిస్థితి లేదు. తెలుగులో తన మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. మరి ఇలాంటి హీరో, దర్శకుడు కలిసి ఔట్ డేటెడ్ జానర్లో ‘చంద్రముఖి’ సీక్వెల్ తీస్తే ప్రేక్షకులు పట్టించుకుంటారా అన్నది డౌట్. తమిళంలో ఏమో కానీ.. తెలుగులో మాత్రం ఈ సినిమా ఆడటం కష్టమే అనిపిస్తోంది.

This post was last modified on June 30, 2023 4:04 pm

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

7 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

8 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

9 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

10 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

10 hours ago