ఒకప్పుడు డాన్స్ మాస్టర్ గా, దర్శకుడిగా నాగార్జున, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలను డీల్ చేసిన లారెన్స్ రాఘవేంద్ర ఆ తర్వాత ముని సిరీస్ నుంచి పూర్తిగా దెయ్యాల స్పెషలిస్ట్ గా మారిపోయాడు. దానికి తగ్గట్టే ఒకే కథను అటు ఇటు తిప్పి ఇంకో రెండు భాగాలు తీసినా అవి కూడా కమర్షియల్ గా పెద్ద హిట్టు కావడంతో ఆ ఫ్రాంచైజీని వదలకుండా అలాగే కొనసాగిస్తున్నాడు. అందుకే సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఐకానిక్ మూవీ చంద్రముఖి సీక్వెల్ కి ఏరికోరి మరీ లారెన్స్ నే తీసుకున్నాడు దర్శకుడు పి వాసు. సెప్టెంబర్ 15 విడుదల చేయబోతున్నట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
బాగానే ఉంది కానీ అదే రోజు బోయపాటి శీను – ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబోలో రూపొందుతున్న స్కంద(ప్రచారంలో ఉన్న టైటిల్) ఆల్రెడీ అఫీషియల్ గా లాక్ చేసుకుంది. దీనికన్నా ముందు సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ ని షెడ్యూల్ చేసి పెట్టారు. ఈ రెండు క్లాష్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మధ్యలో చంద్రముఖి 2 రావడం మాస్ మార్కెట్ ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే లారెన్స్ కి సోలో హీరోగా ఇక్కడ డబ్బింగ్ బిజినెస్ తగ్గినప్పటికీ సరైన కథ, కాంబో పడితే మళ్ళీ లేచి కూర్చుంటాడు. చంద్రముఖి 2 సరిగ్గా అదే కోవలో కనిపిస్తోంది.
ఆ మధ్య వచ్చిన రుద్రుడు డిజాస్టర్ అయినా మొదటి రోజు మార్నింగ్, మ్యాట్నీలకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కంటెంట్ దారుణంగా ఉండటం వల్ల పోయింది. చంద్రముఖి 2కి అలా ఉండదు. పి వాసు డైరెక్షన్ తో పాటు కోట్లు ఖర్చు పెట్టే లైకా టీమ్, భారీ మార్కెటింగ్ చేయగల సామర్ధ్యం దానికి ఉన్నాయి. హీరోయిన్ కంగనా రౌనత్, ఎంఎం కీరవాణి సంగీతం లాంటి ఆకర్షణలు సెట్ చేశారు. రామ్, సిద్దుల క్రౌడ్ పుల్లింగ్ ని తక్కువ చేసి చూడలేం కానీ బిసి సెంటర్స్ లో లారెన్స్ ఇచ్చే పోటీని లైట్ తీసుకోకూడదు. రజనికాంత్ క్యామియో అనుకున్నారు కానీ సాధ్యపడలేదట
This post was last modified on June 30, 2023 10:23 am
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…